నవతెలంగాణ-తాడ్వాయి/గోవిందరావుపేట
పాత పొడు సాగును వదులుకోబోము కొత్తగా పోడు సాగు చేయబోము ఇది మా రైతుల సమిష్టి నిర్ణయమని నార్లాపూర్ రైతులు అంటున్నారు. గురువారం నార్లాపూర్ రైతులు పోడు వ్యవసాయం ప అటవీ అధికారుల ఇబ్బందులపై నవతెలంగాణ తో మాట్లాడారు. నార్లాపూర్ బయక్క పేట రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. గత 25 సంవత్సరాల నుండి పోడు వ్యవసాయం చేసుకుంటున్నాం . గత నాలుగు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం అటవీ అధికారులు సీజన్ ప్రారంభంలో ఇబ్బందులకు గురిచేయడం పరిపాటిగా మారింది. రైతుల మొబైల్ ఫోన్లు లాక్కోవడం, ట్రాక్టర్లను నిలిపివేయడం, ఒంటరిగా ఉన్న రైతులను వేధించడం, మహిళల రైతుల తో అసభ్యకరంగా మాట్లాడడం తోసి వేయడం వంటి సంఘటనలకు పాల్పడుతున్నారని రైతులు ప్రధానంగా మహిళా రైతులు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. గతంలో మక్సుద్, సుజాత, వంశీకృష్ణ, గౌతమ్ రెడ్డి హయాంలో కూడా తాము ఎలాంటి ఇబ్బందులు పడలేదని ఇప్పుడు మాత్రం అనేక ఇబ్బందులకు పెడుతూ సాగు చేసుకోకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. విషయం ఏమన్నా ఉంటే కూర్చొని మాట్లాడేవారని అన్నారు. ప్రస్తుతం వర్షం పడి అదును ఉంది ఈ సమయంలో వ్యవసాయం చేసుకోకపోతే మరో 10 రోజుల తర్వాత ఎందుకు పనికిరాకుండా పోతుంది. దూక్కి దున్న కుండా అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అని రైతులు ప్రశ్నిస్తున్నారు.గత 7 సంవత్సరాలుగా కొత్త పోడు కొట్టడం కానీ సాగు చేయడం గాని జరగడంలేదని గతంలో తాతలు తండ్రులు సాగుచేసిన భూమిని సాగు చేసుకుంటున్నామని అంటున్నారు. గ్రామం పోటు రైతులందరూ సమిష్టిగా చెబుతున్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ పాత ఫోడు ను సాగుచేసుకోనియండి
అడ్డుకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. పాత సాగు భూమిని ఇంచు కూడా వదులుకోమని అడ్డుకోవడానికి ప్రయత్నించి రైతులను అసహనానికి గురి చేయొద్దని అన్నారు. గతంలో సాగు చేసుకున్న భూమి వరకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం అయినా అడ్డుకుంటే పోడు రైతులందరూ ఏకమై జిల్లా అటవీ క్షేత్ర కార్యాలయం ముందు ధర్నా రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వందల వేల ఎకరాలను బడా బడా వ్యాపారులకు సంస్థలకు కారు చౌకగా బేరం పెడుతున్న వారిని అడగలేక ఎకరం రెండెకరాలు పోడు వ్యవసాయం చేసుకునే రైతులపై కేసులు పెడతాం ట్రాక్టర్లు పట్టుకుపోతాం ఫోన్లు ఊడగొట్టడం వంటి సంఘటనలకు అధికారులు పాల్పడడం సమంజసం కాదని అన్నారు. ఇప్పటికైనా అధికారులు రైతులను అసహనానికి గురి చేయకుండా సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు ధరావత్ వినోద్, నునావత్ శ్రీను, డి నరేందర్, జాటోత్ సొంని, కుక్కల మల్లయ్య చీమల కుమార్ మిర్యాల తిరుపతి వెంకన్న దాసరి ఎల్లయ్య నువ్వు నావత్ కోటి గురజాల శ్రీకాంత్ గంట వీరయ్య కొమ్మివేని సదయ్య ముప్పిడి సాయికుమార్ కొమ్మివేని రమేష్ నునావత్ శంకర్, దాసరి ఎల్లయ్య చిన్నాల స్వరూప తో పాటు మరో 100 మందికి పైగా రైతులు పాల్గొన్నారు.