– ఉపాధిహామీ చట్టాన్ని రక్షించుకుందాం : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్ష్మి
నవతెలంగాణ-నాగారం
సీపీఐ(ఎం) భువనగిరి పార్లమెంట్ సభ్యులు ఎండి జహంగీర్‌ను గెలిపించి, ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్ష్మి పిలుపునిచ్చారు. శనివారం సూర్యాపేట జిల్లా నాగారం మండల పరిధిలోని ఢకొీత్తపల్లి గ్రామంలోని ఉపాధిహామీ పనులను పరిశీలించి కూలీలతో ఆమె మాట్లాడారు. కేంద్రంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం వచ్చినట్టయితే ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా రద్దు చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం పేద, మధ్యతరగతి రైతులు, కార్మికులను ఇబ్బందిపెడుతూ బడా కార్పొరేట్ సంస్థలతో అంటకాగుతోందని విమర్శించారు. విద్య, వైద్య రంగాలను కార్పొరేట్లకు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో సుత్తికొడవలి నక్షత్రం గుర్తుకు ఓటేసి జహంగీర్‌ను పార్లమెంట్‌కు పంపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేశ్, నాయకులు జె.నర్సింహారావు, దేవరకొండ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.