ఎర్రజెండా ముద్దుబిడ్డ ఎండీ జహంగీర్ ను గెలిపించండి

నవతెలంగాణ – చౌటుప్పల్ రూరల్
చౌటుప్పల్ మండలం చిన్నకొండూరు గ్రామంలో సీపీఐ(ఎం) పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుక ఎండి జహంగీర్ ను భువనగిరి పార్లమెంటు ఎంపీగా గెలిపించాలని శాఖ సమావేశంలో ఎలుకరాజు యాదగిరి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. శుక్రవారం చిన్న కొండూరు సీపీఐ(ఎం) శాఖ కార్యదర్శి ఆదిమూలం నందీశ్వర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై ప్రశ్నించే భువనగిరి పార్లమెంటు సీపీఐ(ఎం) అభ్యర్థి ఎండి జహంగీర్ గారిని అధిక మెజారిటీతో గెలిపించాలని ఈ దేశాన్ని 10 సంవత్సరాలుగా ఏలుతున్న బీజేపీ మతోన్మాద ప్రభుత్వం ప్రభుత్వ రంగాలన్నిటిని నిర్వీర్యం చేస్తూ ప్రభుత్వ రంగాలు రైల్వే, బ్యాంకింగ్, ఎల్ఐసి రంగాలను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టుతు, ప్రైవేటుపరం చేస్తూ దేశంలో నిరుద్యోగం ఎన్నడూ లేనంతగా పెంచి పోషించిందని ఆదిమూల నందీశ్వర్ పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం విపరీతంగా ధరలు పెంచుతూ ప్రజలపై పెనుబారం మోపుతున్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని లోకసభ ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. అట్లాగే ప్రతినిత్యం సమస్యలపై పోరాడుతున్న ఎర్రజెండా ముద్దు బిడ్డ భువనగిరి పార్లమెంటు అభ్యర్థి ఎండి జాంగీర్ ని ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి చిన్న కొండూరు ఎంపీటీసీ చెన్నబోయిన వెంకటేష్ సీపీఐ(ఎం) పార్టీ నాయకులు ఎస్కే ఇబ్రహీం, జంగయ్య, తూర్పునూరి జంగయ్య, చీమకండ్ల శ్రీరాములు, బక్క యాదయ్య, చెక్క శీను తదితరులు పాల్గొన్నారు.
Spread the love