రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకుందాం

– బహుజన లెఫ్ట్ పార్టీ – బీఎల్పీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సబ్బని లత
నవతెలంగాణ – కంటేశ్వర్
కోట్లాదిమంది భారతీయుల త్యాగాల పునాదులపై గణతంత్ర భారత ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మాణానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పునాదులు వేయడం వల్లనే ప్రపంచంలో అత్యంత ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా మనుగడ సాగించడానికి కారణమైందని బహుజన లెఫ్ట్ పార్టీ- బీఎల్ పీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సబ్బని లత అన్నారు. ఈ మేరకు శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లోగల బహుజన లెఫ్ట్ పార్టీ-బీఎల్ పీ జిల్లా కార్యాలయంలో వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆమె మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన సంక్షేమం సమానత్వం, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడం ద్వారా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా మోదీ పాలనా సాగుతోందని, సామాజిక న్యాయ సూత్రాలను బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కటి కాలరాస్తుందని విమర్శించారు. స్వాతంత్ర్య సమర యోధుల స్వప్నం భారత రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి భారతీయులు కాపాడుకోవడానికి ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బహుజన లెఫ్ట్ పార్టీ-బీఎల్ పీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్, జిల్లా కన్వీనర్ కె.మధు, బీఎల్ టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్,బహుజన లెఫ్ట్ మహిళా సంఘం జిల్లా కార్యదర్శి దండు జ్యోతి, బహుజన శ్రామిక మహిళా సంఘం జిల్లా కన్వీనర్ కె.ఆశబాయి, బీఎల్ టీయు నగర అధ్యక్షులు టి.రాజు బిడిఎస్ఎఫ్ జిల్లా కన్వీనర్ శ్రీమాన్, బహుజన లెఫ్ట్ యూత్ ఫెడరేషన్ నగర్ కన్వీనర్ కె. సహాదేవ్, గంగాధర్, హైమద్  తదితరులు  పాల్గొన్నారు.
Spread the love