పండుగలను మతసామరస్యంతో జరుపుకుందాం

– వరంగల్‌ సీపీ ఏవీ.రంగనాథ్‌
నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా
మతాలకు అతీతంగా మన పండుగలను మత సామరస్యంగా నిర్వహించు కుందామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. రానున్న వినాయక చవితి, మిలాద్‌-ఉన్‌-నబి పండుగలను పురస్కరించుకుని సెంట్రల్‌ జోన్‌ పోలీసుల అధ్వర్యంలో శాంతి పరిరక్షణ కమిటీ సమావేశాన్ని బుధవారం ములుగు రోడ్డులోని వెంకటేశ్వర గార్డెన్‌లో ఏర్పాటు చేసారు. త్రినగరిలోని వివిధ మతాలకు చెందిన మతపెద్దలతో పాటు, గణేష్‌ నవరాత్రి మండళ్ళ నిర్వహకులు హాజరైఏ ఈ సమా వేశానికి వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ అన్ని మతాలకు చెందిన ప్రజలు సోదరభావంతో, శాంతియుత వాతావరణంలో పండు గలను జరుపుకుంటూ, మత సామరస్యానికి ప్రతీకగా నిలవాలన్నారు. శాంతి భద్ర తలు అదుపులో ఉన్నచోటే అభివద్ధి వేగంగా జరుగుతుందని ప్రజలు గుర్తించాల న్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జర గకుండా పోలీస్‌శాఖ అప్రమత్తంగా ఉన్నప్పటికీ ఏదేని చిన్న చిన్న సంఘటనలు జ రిగితే వాటిని రాజకీయలకు ముడిపెట్టొద్దన్నారు. ఏవర్గం వారికైనా ఇతరుల వల న ఇబ్బందికర సమస్యలు తలెత్తితే, పరిష్కారానికై సంబంధిత అధికారుల దష్టికి తీ సుకురావాలే తప్ప స్వతహాగా వ్యవహరించకూడదన్నారు.
ఇటీవల సోషల్‌ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు, ఇతరుల మనోభావాలు దెబ్బతినే విధంగా అభ్యంతరకర పోస్టులు పెట్టి అవకాశం ఎక్కువగా ఉన్నందున ప్రజలు అట్టి పోస్టులను చూసినవెంటనే ప్రతిస్పందించకుండా, సంయమనం పా టిస్తూ అట్టిపోస్టుల్లో నిజనిజాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలని, అందుబా టులో వున్నసంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలే తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని ఒకవేళ ఉల్లంఘించిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకో వడం జరుగుతుందన్నారు. గతంలో ఎన్నడు వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో ఎ టువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని. ఇదే సంస్కతిని కోనసాగిస్తూ ఈసారి కూడా శాంతియుతంగా పండుగలు జరిగేలా అన్ని వర్గాల ప్రజలు, మత పెద్దలు సహకరించాలనికోరారు. ఈ సంవత్సరం నూతనంగా ఏర్పాటు చేసే గణే ష్‌ మండపాల సమాచారాన్ని సంబంధిత పోలీస్‌ అధికారులకుతప్పకుండా తెలి యచేయాలని తెలిపారు. అందువలన మండపం వద్ద తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపే అవకాశం ఉ ంటుందని పోలీస్‌ గస్తీ నిర్వహిస్తామని తెలిపారు. గణేష్‌ మం డపాల వద్ద బాధ్యత కలిగిన నిర్వహణ కమిటీ సభ్యులు, సీసీ కెమెరా ఏర్పాటు, షాట్‌ సర్క్యూట్‌ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిర్వహణ సభ్యులు పోలీసులకు సహకరిస్తూ శాంతియుత వాతావరణం లో పండుగ జరుపు కోవాలని కోరారు.
ఈ సమావేశంలో సెంట్రల్‌ జోన్‌ డిసిపి బారి, ఏసిపిలు బోనాల కిషన్‌, డేవిడ్‌ రాజు, జితేందర్‌రెడ్డి, భోజరాజు, ఇన్సెస్పెక్టర్లు, ఎస్‌ఐలతో పాటు మతపెద్దలు భద్ర కాళి దేవాస్థానం ప్రధానపూజరి శేషు, తెలంగాణ అర్చన సంఘం అధ్యక్షుడు గంగు ఉపేందర్‌ శర్మకాజీపేట దర్గా పీఠాధిపతి ఖుస్రూపాషా, మైనార్టీసెల్‌ సభ్యుడు దర్శన్‌ సింగ్‌, సామ్యూల్‌, అతీఖ్‌ రహమాన్‌, గణేష్‌ ఉత్సవ కమిటీ కో ఆర్డినేటర్‌ జైపాల్‌ రెడ్డి, ఉదరు కుమార్‌ మరికొందరు మత పెద్దలు పాల్గోన్నారు.

Spread the love