కొల్కతా : పశ్చిమ బెంగాల్లో త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ను, బీజేపీని ఓడించాలని సీపీఐ(ఎం) పిలుపునిచ్చింది. ఈ మేరకు సందేశ్కాలిలో బుధవారం నాడు నిర్వహించిన ర్యాలీలో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు సుజాబ్ చక్రవర్తి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పలాష్ దాస్ పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వినాశకర విధానాల వల్ల రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తృణమూల్, బిజెపి పంచాయతీల్లో లూటీలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయిన ఈ రెండు పార్టీలనూ పంచాయతీ ఎన్నికల్లో ఓడించి వామపక్షాల అభ్యర్థులను గెలిపించాలని కోరారు.