తాగుదాం.. తాగి ఊగుదాం

‘బిగ్‌బాస్‌’ ఫేమ్‌ సోహెల్‌ టైటిల్‌ రోల్‌లో శ్రీ కోనేటి దర్శకత్వంలో ఎండీ పాషా నిర్మిస్తున్న చిత్రం ‘బూట్‌కట్‌ బాలరాజు’. మేఘలేఖ, సునీల్‌, సిరి హన్మంత్‌, ఇంద్రజ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రం నుంచి ‘తాగుదాం తాగి ఊగుదాం..’ పాటని దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ విడుదల చేశారు. ‘ధమాకా’ ఫేమ్‌ భీమ్స్‌ సిసిరోలియో ఈ పాటని తనదైన స్టయిల్‌లో మాస్‌ నెంబర్‌ నెంబర్‌గా కంపోజ్‌ చేశారు. రాహుల్‌ సిప్లిగంజ్‌, సాయి మాధవ్‌ మాస్‌ ఎనర్జీతో పాడిన ఈ పాటకు అఫ్రోజ్‌ అలీ క్యాచీ లిరిక్స్‌ అందించారు. ఈ పాటలో సోహెల్‌ మాస్‌ డ్యాన్స్‌ మూమెంట్స్‌ ఆకట్టుకున్నాయి.
ఈ చిత్రానికి డీవోపీ: శ్యామ్‌ కె నాయుడు, ఎడిటర్‌: విజరు వర్ధన్‌, డైలాగ్స్‌: దుబాసి రాకేష్‌, జబర్దస్త్‌ రాంప్రసాద్‌.

Spread the love