నవతెలంగాణ-గండిపేట్
మాదక ద్రవ్యాల ఆక్రమ రవాణను పూర్తిగా వ్యతిరేకిద్దామని సీబీఐటీ యు ప్రిన్సిపాల్ డాక్టర్ రవీందర్‌రెడ్డి అన్నారు. సోమవారం గండిపేట్‌లోని సీబీఐటీ కాలేజీల్లో విద్యార్థులు, అద్యాపకుల సమక్షంలో మాదక ద్రవ్యాల ఆక్రమ రవాణకు వ్యతికేరంగా ఆంతర్జాతీయా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చెడు వ్యసానాలకు లోను కాకుండ దేశాభివృద్ధి పాటుపడాలన్నారు. అనంతరం కాలేజీల్లో ర్యాలీ చేపట్టారు. ఆరోగ్యానికి హని కలిగించే పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో విద్యార్థులు, అద్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.