ప్రజా సమస్యలపై పోరాడుదాం…అసెంబ్లీలో సత్తా చాటుదాం

నవతెలంగాణ -మద్నూర్
మద్నూర్ మండల బిజెపి కార్యవర్గ సమావేశం శుక్రవారం నాడు నిర్వహించారు ఈ కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా నాయకులు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడుదాం రాబోయే ఎన్నికల్లో జుక్కల్ అసెంబ్లీ లో సత్తా చాటుదాం అంటూ వారు కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు ఈ కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథులు జిల్లా బిజెపి అధ్యక్షురాలు జుక్కల్ మాజీ శాసనసభ్యురాలు అరుణతార, మద్నూర్ మండల ఇంచార్జ్ ఆకుల భారత్ ,జిల్లా జనరల్ సెక్రెటరీ రము సెట్, జిల్లా ఉపాధ్యక్షులు సతీష్ పంతులు హాజరయ్యారు మండల పార్టీ అధ్యక్షులు అధ్యక్షులు బీ హనుమాన్లు, అధ్యక్షతన జరిగిన సమావేశంలో మండల జనరల్ సెక్రెటరీ చట్లవార్ హన్మoడ్లు, కొండా వీరేశం, రాము రుసేగావు, దిలీప్ పటేల్, విట్టల్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Spread the love