నవతెలంగాణ – నసురుల్లాబాద్
ప్రస్తుతం ప్లాస్టిక్ భూతం పట్టిపీడిస్తుందని ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ భూతాన్ని తరిమేవెందుకు సిద్ధంగా ఉండాలని నసురుల్లాబాద్ ఎంపీపీ పాల్త్య విఠల్ సూచించారు. సోమవారం నసురుల్లాబాద్ మండలం లోని సంగెం గ్రామంలో నెహ్రు యూవ కేంద్రం మరియు సేవా సంఘ్ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గ్రామంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ రోజు రోజు కు పర్యావరణం కలుషితం అవుతుందని, మొక్కల పెంపకం ద్వారానే పర్యావరణాన్ని కాపాడుకోవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ రెండు మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలన్నారు. అడ్డగోలుగా నిబంధనలకు విరుద్ధంగా పుట్టుకొస్తున్న ఫ్యాక్టరీలు ఒక వైపు, మహా అరణ్యాలనే అంతం చేస్తున్నారు. అందుకే ప్రకృతి వర్షాకాలంలో విపరీతంగా ఎండలు, ఎముకలు కొరికే చలి, రక్తం గడ్డ కట్టే చలి, మాడ పగిలేలా కొట్టే ఎండలు, వరదలు వస్తున్నాయి ఇకనైనా ప్రతి ఒక్కరు మేలుకొని పర్యావరణ పరిరక్షణకు నడుంబిగించాలి అన్నారు. ఈ కార్యక్రమంలో సేవా సంఘ్ ఫ్రెండ్స్ యూత్ కన్వీనర్ సునీల్ రాథోడ్, గ్రామ ఉపసర్పంచ్ సాయగౌడ్, సెక్రెటరీ అనిల్, గొల్ల సాయి, శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.