దొర్ల పాలనకు విముక్తి చెబుదాం

నవతెలంగాణ-చంద్రుగొండ
నిరంకుశ అవినీతిమయ దొరల పాలనకు విముక్తి చెప్పాలని అశ్వారావుపేట నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జారే ఆదినారాయణ అన్నారు. సోమవారం మండలంలోని మద్దుకూరు, దామరచర్ల, అయ్యన్నపాలెం, సీతయ్య గూడెం, తిప్పనపల్లి, రేపల్లెవాడ, తుంగారం, గానుగపాడు, రైకంపాడు, చండ్రుగొండ తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జారే మాట్లాడుతూ స్వలాభం కోసం పార్టీ మారిన మెచ్చాకు బుద్ధి చెప్పాలన్నారు. 10 రోజులు కష్టపడితే సంవత్సరాలు అధికారం మనదేనని వారు ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో ప్రజలకు కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో ఉన్న ఆరు గ్యారెంటీలను వివరించారు. కాంగ్రెస్‌ పార్టీ, సీపీఐ, తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌ సీపీ పార్టీల సహకారంతో బీఆర్‌ఎస్‌ను ఓడించటం తద్యమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్‌ నాయకులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి, మండల కాంగ్రెస్‌ నాయకులు సురేష్‌, శేఖర్‌, భోజ నాయక్‌, రవణ, మండల కాంగ్రెస్‌ అధ్యక్షులు దారం గోవింద్‌ రెడ్డి, ఎంపీపీ బానోత్‌ పార్వతి, సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love