నవతెలంగాణ కంఠేశ్వర్ : సంఘం శరణం గచ్చామి నాటిక కళా ప్రదర్శన కరపత్రం ఆవిష్కరణ జరగింది. ఈ మేరకు ఆదివారం సాయంత్రం జిల్లా నిజమాబాద్ సిటీ కంటేశ్వర్ తెలంగాణ ఉద్యమ పితమహుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయంకర్ విగ్రహం సాక్షిగా పలు సంఘాల ఆధ్వర్యంలో విడుదలైంది. అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్ వారిచే సంఘం శరణం గచ్చామి అనే నాటికలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జీవిత చరిత్ర ఆయన లక్ష్యంపై కళా ప్రదర్శన బాల్కొండలోని ఎం. కె గార్డెన్ లో సెప్టెంబర్ 21న సాయంత్రం 6: గంటలకు జరగనున్నట్లు తెల్పారు. ఓ గంట ముప్పై నిమిషాల నాటిక చూడడానికి జిల్లాలోని ప్రతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు భారీ సంఖ్యలో హాజరు కావాలని ఈ సందర్భంగా జిల్లా అంబేడ్కరైట్ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బుద్ధిష్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా (బి.ఎస్.ఐ) రాష్ట్ర ఉపాధ్యక్షులు అశోక్ భాగ్యవాన్, వర్ని రోడ్ మాల సంఘం అధ్యక్షులు రాంచందర్ గైక్వాడ్, అశోక్ వాహ్మారే, రాజు టోన్పే, సీమ గంగాధర్, రాజేందర్ కాంబ్లే, బి.ఎస్.ఐ నేత అంతేశ్వర్ వాగ్మారే, గోపాల్ కాంబ్లే, రాజరత్న భాగ్వావాన్, డ్రామా నిర్వాహకులైన డి.ఎల్ మాలజీ, డాక్టర్ ఎ.చిరంజీవి, మూల్ నివాసి మాలజీ పాల్గొన్నారు.