– లెఫ్ట్‌ఫ్రంట్ ఘన నివాళి
కొల్‌కతా : కమ్యూనిస్టు యోధుడు, ఇటీవల కన్నుమూసిన సీపీఐ(ఎం) ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరికి పశ్చిమ బెంగాల్‌లోని లెఫ్ట్‌ఫ్రంట్ ఆధ్వర్యంలో ప్రజానీకం గురువారం ఘన నివాళులర్పించింది. కొల్‌కతాలోని ప్రమోద్ దాస్‌గుప్తా భవన్‌లో లెఫ్ట్‌ఫ్రంట్ చైర్మెన్ బిమన్ బసు అధ్యక్షతన జరిగిన సంతాపం సభలో ఏచూరి సేవలను కొనియాడారు.
ఏచూరి నమ్మిన సిద్ధాంతం కోసం, ఆయన ఆశయ సాధన కోసం జీవితాంతం పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా సభకు హాజరైన వారు ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సమన్వయ కర్త ప్రకాష్ కరత్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎండి సలీం, వామపక్షాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.