విభేదాలు వద్దు.. కలిసుందాం ప్రజలే కేంద్రంగా పనిచేద్దాం

– దుబ్బాక అంటేనే బీఆర్‌ఎస్‌ అడ్దా
– మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు
నవతెలంగాణ-దుబ్బాక
‘విభేదాలు వద్దు, గ్రూపులు వద్దు కలిసుందాం… బీఆరఎస్‌ది బలమైన నాయకత్వమున్న పార్టీ ప్రజల్లో ఉంటూ వారి కష్టసుఖాల్లో అండగా ఉండండి.. మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాది’ అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నా రు. దుబ్బాక ఉపఎన్నికల పరాభవం తననెంతో కలచివేసినా సాధారణ ఎన్నికల్లో కొత్త ప్రభాకర్‌ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించడం తనకు రెట్టింపు సంతోషాన్నిచ్చిందన్నారు. మంగళవారం దుబ్బాక పురపాలిక కేంద్రంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన బీఆర్‌ఎస్‌ కతజ్ఞత సభకు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌ రెడ్డితో కలిసి మాజీ మంత్రి హరీష్‌ రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జయపజయాలు సాజమని పార్టీ అధికారంలో లేదని కుంగిపో వద్దన్నారు. ఓటమి అనేది స్పీడ్‌ బ్రేకర్‌ లాంటిదని తర్వాత వేగం పుంజుకున్నట్టే రెట్టింపు వేగంతో వచ్చేది కేసీఆర్‌ ప్రభుత్వమేనని నొక్కి చెప్పారు. ఎమ్మె ల్యే కొత్త ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ దుబ్బాక ప్రజలు కోరుకున్నట్లే అభివద్ధి చేసే బాధ్యత తీసుకుంటానని, ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటూ పెండింగ్‌ పనుల పైన దష్టి సారిస్తానన్నారు. దుబ్బాక రెవిన్యూ డివిజన్‌ ఏర్పాటు, నాలుగు లైన్ల రహదారి, రింగురోడ్డు,చేగుంటలో కళాశాలలు వంటి హామీలను తప్పకుండా నెరవేస్తానని హామీ ఇచ్చారు. ఈ గెలుపు దుబ్బాక బీఆర్‌ఎస్‌ కార్యకర్తలదేనని అఖండ మెజార్టీతో తనను గెలిపించిన ప్రతీ ఒక్కరికి కతజ్ఞతలు తెలిపారు. జెడ్పీ చైర్‌ పర్సన్‌ రోజా శర్మ, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ గన్నె వనిత భూమిరెడ్డి,ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్‌ రెడ్డి, జెడ్పీటీసీ రవీందర్‌ రెడ్డి, ఏఎంసీ చైర్‌ పర్సన్‌ చింతల జ్యోతి కష్ణ, పీఏసీఎస్‌ చైర్మెన్‌ శేర్ల కైలాశ్‌, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు కోమటిరెడ్డి వెంకట నరసింహారెడ్డి,సోలిపేట సతీష్‌ రెడ్డి, కోమటిరెడ్డి రజనీకాంత్‌ రెడ్డి, కత్తి కార్తీకగౌడ్‌, మనోహర్‌ రావు,జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ లక్కిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love