ప్రజాతీర్పును గౌరవిద్దాం ఆపద్ధర్మ సీఎం కేసీఆర్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిద్దామని అపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చరద్రశేఖర్‌రావు అన్నారు. సోమవారం ఎర్రబెల్లిలోని ఫామ్‌హౌజ్‌లో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాజ్యాంగబద్దంగా జనవరి 16 వరకు ప్రభుత్వం కొనసాగే అవకాశమున్నా ప్రజల తీర్పుతో హుందాగా తప్పుకున్నామని చెప్పారు. కొత్త ప్రభుత్వానికి సహకరిద్దామని ఎమ్మెల్యేలతో అన్నారు. మునుముందు ఏం జరుగుతుందో వేచిచూద్దామని చెప్పారు. త్వరలోనే తెలంగాణ భవన్‌లో పార్టీ సమావేశం ఉంటుందనీ, ఎన్నికల ఫలితాలపై సమీక్షిస్తామని అన్నారు. శాసనసభాపక్ష నేతను కూడా త్వరలోనే ఎన్నుకుందామని ఎమ్మెల్యేలతో చెప్పారు.

Spread the love