11వ వేజ్‌ బోర్డుపై అధికారుల కుట్రలను తిప్పికొడదాం

– బీఎంఎస్‌ నాయకులు అప్పాని శ్రీనివాస్‌
నవతెలంగాణ -కోల్‌బెల్ట్‌
11వ వేజ్‌ బోర్డుపై అధికారులు చేస్తున్న కుట్ర లను తిప్పి కొట్టాలని, కార్మికులు ఆందోళనా కార్య క్రమాలకు, సమ్మెకు సిద్ధంగా ఉండాలని సింగరేణి కోల్‌ మైన్స్‌ కార్మిక సంఫ్‌ు (బీఎంఎస్‌) భూపాలపల్లి బ్రాంచ్‌ ఉపాధ్యక్షులు అప్పాని శ్రీనివాస్‌ కార్మికులకు పిలుపునిచ్చారు. మంగళవారం భూపాలపల్లి ఏరియాలో కేటీకే -5 గనిలో పర్యటించి , శ్రీనివాస్‌ కార్మికులతో మాట్లాడారు.బొగ్గు పరిశ్రమలో పని చేస్తున్న అన్ని కార్మిక సంఘాలు బిఎంఎస్‌, ఎఐటియుసి,సిఐటియు, హెచ్‌ఎంఎస్‌, ఐఎన్‌టి యుసి ఆల్‌ ఇండియా ప్రతినిధుల అత్యవసర సమావేశం రాంచీలోని సిసిఎల్‌ హౌస్‌లో జరిగిం దని అన్నారు. బీఎంఎస్‌ బొగ్గు పరిశ్రమ ఇన్‌చార్జి చార్జి కొత్త కాపు లక్ష్మారెడ్డి, ఏబీకేఎంఎస్‌ వైస్‌ ప్రెసి డెంట్‌ మజ్రుల్‌ హక్‌ అన్సారీ పాల్గొని బొగ్గు పరిశ్ర మలో పని చేస్తున్న కార్మికుల 11వ వేతన ఒప్పందా నికి వ్యతిరేకంగా కోల్‌ ఇండియా ఆఫీసర్స్‌ అసోసి యేషన్‌ సభ్యులు తీసుకున్న చర్యల వల్ల బొగ్గు పరిశ్రమలో తలెత్తిన పరిస్థితులపై చర్చించారని తెలి పారు. ఈ చర్యను ఐదు కార్మిక సంఘాల ప్రతి నిధులు తీవ్రంగా ఖండించారని, ఆఫీసర్స్‌ అసోసి యేషన్‌ ఈ చర్యతో బొగ్గు పరిశ్రమలో కార్మికులు, అధికారుల మధ్య ఏళ్లుగా కొనసాగుతున్న సత్సం బంధాలు దెబ్బతిన్నాయిన తెలిపారు. పై విషయాలు పరిశీలన తర్వాత, భారత ప్రభుత్వంగాని కోల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అధికారుల జీతాలు, సౌక ర్యాలు, అలవెన్సులను 10 సంవత్సరాలలోపు కాల పరిమితి ముగియక ముందే పెంచినట్లయితే, అన్ని కార్మిక సంఘాలు దానిని వ్యతిరేకిస్తాయని సమావేశంలో నిర్ణయించారు. యాజమాన్యం గనుక మళ్ళీ పే రివ్యూ అధికారులకు వర్తింపజేస్తే.. దాని ప్రకారం బొగ్గుగని కార్మికులకు వర్తింపజేయాలని, అంతే కాకుండా ఇక నుంచి అధికారులతో బొగ్గు పరిశ్రమకు సంబంధించిన ఏ వేదికలోను కార్మిక సంఘాల ప్రతినిధులు ఎవ్వరు పాల్గొన కూడదని నిర్ణయించారని వివరించారు. ఇక బొగ్గు రంగ పరిశ్రమలో సిఐఎల్‌ , ఎస్‌ సిసిఎల్‌ (సింగరేణి) లో అక్టోబర్‌ 5,6,7 తేదీల్లో బొగ్గు పరిశ్రమలో 3 రోజుల సమ్మె చేయాలని సమావేశంలో నిర్ణయించారు. సమ్మెను విజయవంతం చేసేందుకు అన్ని యూని యన్లు సంయుక్తంగా సమ్మెకు సన్నాహాలు ప్రారంభిం చాలని పిలుపునిచ్చాయి. ఈ నెల 21,22 న మైన్‌, ఓపెన్‌ కాస్ట్‌ , డిపార్ట్‌ మెంట్‌ స్థాయిలో, అక్టోబర్‌ 3న ఏరియా స్థాయిలో ఉమ్మడి ధర్నా, ప్రదర్శనలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో పని రమేష్‌, యూసుఫ్‌,కొత్తూరి మల్లేష్‌, సంతోష్‌,సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
హెచ్‌ఆర్‌ఏ చెల్లించాలి
ఇల్లందు, బెల్లంపల్లి, కొత్తగూడెం, మందమర్రి ఏరియాలలో చెల్లిస్తున్న విధంగా తాత్కాలిక నిర్మాణాలైనా బారక్‌ లలో నివసిస్తున్న కార్మికులకు హెచ్‌ఆర్‌ఏ చెల్లించాలని బీఎంఎస్‌ నాయకులు అప్పాని శ్రీనివాస్‌ యాజమాన్యాన్ని డిమాండ్‌ చేశారు. సింగరేణి రాజకీయ జోక్యం విపరీతంగా పెరి గిపోతుందని దానికి తార్కాణమే ప్రస్తుత క్వార్టర్స్‌ అలాట్మెంట్‌ విధానంలో ప్రత్యక్షంగా కనబడు తుందని, సింగరేణేతరులకు సింగరేణి క్వార్టర్లను కేటాయించడం ఏంటని సింగరేణి యాజమాన్యాన్ని నిలదీశారు. గెలిచిన కార్మిక సంఘాలు యాజమా న్యానికి, ప్రభుత్వానికి అడుగులకు మడుగులోత్తుతూ వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు.

Spread the love