మూడు గంటలా! మూడు పంటలా! తేల్చుకుందాం

– వై సతీష్ రెడ్డి రెడ్ కో  చైర్మన్
నవతెలంగాణ-గోవిందరావుపేట
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ రైతు వేదిక ఏకగ్రీవ తీర్మానం. మూడు గంటల విద్యుత్తు ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ మూడు పంటలకు సరిపడా ఉచిత విద్యుత్తు, నీరు ఇస్తామన్న బిఆర్ఎస్ పార్టీ కావాలా రైతులు తెల్చ బోతున్నారని  రాష్ట్ర రెడ్ కో  చైర్మన్ వై సతీష్ రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో భూపాలపల్లి ములుగు జిల్లాల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు పల్లా బుచ్చయ్య అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వై సతీష్ రెడ్డి హాజరై మాట్లాడారు. నీళ్లు నిధులు నియామకం నినాదంతో ఎన్నో ఏళ్ల తరబడి పోరాటాలు ఉద్యమాలు నిరాహార దీక్షలు ఉద్యమకారులను కోల్పోయి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకొని  అధికారంలోకి వచ్చి కలలను సాకారం చేసుకుంటున్నామని అన్నారు. నాటి తెలంగాణ పరిస్థితి ఏంటి నేటి తెలంగాణ పరిస్థితి ఏంటి అని ఒకసారి చూసుకుంటే ఎంతో అభివృద్ధి సాధించామని అన్నారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా 47 వేల చెరువులను రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి చేసి నేడు పంటలకు పుష్కలంగా నీరుస్తున్న ఘనత విఆర్ఎస్ పార్టీని అన్నారు. ములుగు నియోజకవర్గంలో 15 వేల మందికి పోడు భూముల పట్టాలు ఇచ్చినామని అదేవిధంగా మొక్కలు పెంచుతూ అడవులను కూడా కాపాడుకుంటున్నామని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల ఎకరాలకు పోడుగు పట్టాలు అందించిన ఘనత కేసిఆర్ కి దక్కిందని అన్నారు. ఏజెన్సీలో గిరిజనులతో పాటు గిరిజన ఇతరులకు కూడా లాభం చేకూరుస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ పోడు భూముల పట్టాల సందర్భంగా మాట్లాడారని తప్పకుండా చేసి తీరతారని నమ్మకంతో ఉండాలని అన్నారు. రాష్ట్రం ఏర్పడ్డ మొదట్లో ఏడు వేల మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి మాత్రమే ఉండేదని నేడు 18 వేల మెగాపట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసుకుంటున్నామని మన ప్రగతికి ఇదో నిదర్శనం అని అన్నారు. ప్రతి సంవత్సరం నాలుగున్నర లక్షల కోట్లు 9 సంవత్సరాల కాల వ్యవధిలో 3వేల కోట్ల రూపాయల నిధులను రైతుబంధు పేరుతో రైతుల ఖాతాల్లో  జమ చేశామని అన్నారు. భారతదేశంలో రైతులకు ఇంత ఆర్థిక సహాయం అందించిన రాష్ట్రం ఎక్కడా లేదని మన తెలంగాణ రాష్ట్ర మనని అన్నారు. కంపెనీలపరంగా చూసుకుంటే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అమెరికా తర్వాత స్థానంలో ఉందని ఒకప్పుడు 50 వేల ఇండస్ట్రీస్ తోని ఉంటే ఇప్పుడు మూడు లక్షల కోట్ల  ఆదాయం ఇండస్ట్రియల్ పరంగా అభివృద్ధి అయ్యాయని అన్నారు. రక్షణ పరంగా రహదారి పరంగా హైదరాబాద్ ఎంతో సేఫ్టీ అని స్పష్టం చేయడంతోనే కంపెనీలు హైదరాబాద్ తరలివస్తున్నాయని ముందు ముందు మరిన్ని కంపెనీలు వెలిసే అవకాశం ఉందని మరింత అభివృద్ధి చెందే రాష్ట్రంగా తెలంగాణ ఉంటుందని అన్నారు. కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో సగానికి పైగా అవార్డులను మన రాష్ట్రం గెలుచుకుందని పని చేస్తేనే కదా అవార్డులు వచ్చేదని అన్నారు.  ఒకప్పుడు విద్యుత్తు రైతులు పోరాటాలు చేస్తే హైదరాబాదు నడిబొడ్డున  రైతులను కాల్చి చంపిన చరిత్ర ఇతర పార్టీలదని ఈనాడు సబ్ స్టేషన్ల ముందు కానీ ఎరువుల కోసం కానీ రైతులు ధర్నాలు రాస్తారోకోలు చేసిన సంఘటనలు లేవని ఏనాడో మరిచిపోయామని అన్నారు. లక్నవరం చెరువుకు దేవాదుల, ఎస్సారెస్పీ వీటిని తరలించేందుకు ప్రణాళికలు రూపొందించామని సంబంధిత కలెక్టర్ తో మాట్లాడి చర్చించామని ముందు ముందు కూడా మాట్లాడి నీటిని లక్నవరం తరలించే విధంగా చర్యలు చేపడతామని అన్నారు.
రేవంత్ రెడ్డి బేషరతుగా రైతులకు క్షమాపణ చెప్పాలి
బడే నాగజ్యోతి ములుగు జిల్లా జడ్పీ చైర్పర్సన్
విద్యుత్తుపై అవగాహన లేకుండా మూడు ఎకరాలకు మూడు గంటల విద్యుత్తు సరిపోతుందని అమెరికా తాళాసభల్లో మాట్లాడిన రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి క్షమాపణ చెప్పాలని ములుగు జిల్లా జడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి డిమాండ్ చేశారు. ఈ ఒక్క మాటతో కాంగ్రెస్ పార్టీ కొద్దిగా గొప్ప రైతుల్లో ఉన్న సానుభూతిని కోల్పోయిందనీ ఈ విషయాన్ని సమర్థించిన ఎమ్మెల్యే ములుగు రైతాంగానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. రైతులు నొప్పించిన ఏడిపించిన నాయకులు ఎవరు చరిత్రలో బాగుపడలేదని రైతుల ఉసురు తగులుతుందని అన్నారు. రేవంత్ రెడ్డికి వ్యవసాయంపై అనుభవం అవగాహన లేదు. పోరిక గోవింద నాయక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఒక పెయింటర్ గా జీవితాన్ని ప్రారంభించిన రేవంత్ రెడ్డికి వ్యవసాయంపై అవగాహన అనుభవం లేకనే విద్యుత్తుపై అనుభవ రాహిత్యంగా మాట్లాడారని అన్నారు. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు స్పష్టంగా వినిపిస్తుంటే కాంగ్రెస్ పార్టీ వక్రీకరించారని రాష్ట్ర రైతాంగాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని అంటున్నారని అన్నారు. జీవితంలో తెలంగాణ రైతాంగం రేవంత్ రెడ్డిని క్షమించాలని తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. అనంతరం ఎంపీపీసూడి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి మాటలను ఆ పార్టీ నాయకులే ఖండిస్తున్నారని అన్నారు. లక్నవరం చెరువు సమస్యలను పరిష్కరించాలని కాలువ మరమ్మతులను వెంటనే పూర్తి చేయాలని అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సురపనేని సాయికుమార్, ఎంపీటీసీలు ఆలూరి శ్రీనివాసరావు, స్వరూప, రైతుబంధు జిల్లా సభ్యులు లాకావత్ మమత, రైతు సమన్వయ సమితి గ్రామ కోఆర్డినేటర్లు బొల్లం ప్రసాద్ కొలసాని శ్రీనివాసరావు లకావత్ చందులాల్ పిఎసిఎస్ డైరెక్టర్ లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Spread the love