”ఓటు హక్కు వజ్రాయుధం వంటిది.అంతటి శక్తి కలిగిన ఓటును డబ్బు,మద్యం,ఇతర ప్రలోభాలకు లోనై అమ్ముకోవద్దు.నిజాయితీగా,నిష్పక్షపాతంగా ఓటేసి సమ సమాజాన్ని నిర్మించడంలో ప్రతీ ఓటరు భాగస్వాములు కావాలి” అని దుబ్బాక మండల తహసీల్దార్ ఈ.సంజీవ్ కుమార్,మున్సిపల్ కమిషనర్ కే.రమేష్ కుమార్ అన్నారు.15 వ ‘జాతీయ ఓటరు దినోత్సవాన్ని’ పురస్కరించుకొని శనివారం దుబ్బాక పట్టణ కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా రెవిన్యూ,మున్సిపల్,విద్యా,పోలీసు శాఖల సంయుక్తంగా ఓటు ప్రాముఖ్యతను వివరిస్తూ భారీ ర్యాలీని నిర్వహించాయి.ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన,క్రీడా పోటీలు నిర్వహించడం జరిగింది.ఈ ర్యాలీలో ఎంఈఓ జోగు ప్రభుదాస్,ఆర్ఐ లు నరసింహారెడ్డి,నరేందర్,ఆయా శాఖల అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.