– కల్వకుర్తి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జి గోలి శ్రీనివాస్ రెడ్డి , ఎమ్మెల్యే జైపాల్ యాదవ్..
నవతెలంగాణ -వెల్దండ
కార్యకర్తలందరూ సమన్వయంతో పని చేస్తూ కల్వకుర్తిలో , రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గెలుపుతో కేసీఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రి చేసుకుందామని కల్వకుర్తి టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్చార్జి , రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి , కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. బుధవారం వెల్దండ మండల కేంద్ర సమీపంలోని ఏవిఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల ఆశీర్వాద సభకు వీరు ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు.. కెసిఆర్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వము అని , ప్రజలు కోరుకున్న విధంగా కేసీఆర్ పాలన ఉంటుందన్నారు. అందుకే తెలంగాణ రాష్ట్ర సాధన నాటి నుండి నేటి వరకు కేసీఆర్ వెంట తెలంగాణ ప్రజానీకం ఉందన్నారు. తెలంగాణ ప్రజల బలంతోనే కెసిఆర్ మూడవసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం ఖాయమన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చేయలేని ఎన్నో సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకువచ్చారన్నారు. రాష్ట్రంలోని ప్రతి గడపకు ప్రభుత్వ సంక్షేమ పథకం ఏదో ఒక విధంగా తప్పనిసరిగా అందింది అన్నారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రానికి దేశంలోని ఏ రాష్ట్రం సాటిరాదన్నారు. ప్రధానంగా కల్వకుర్తిలో పార్టీ అభ్యర్థి జైపాల్ యాదవ్ గెలుపు కోసం గ్రామీణ ప్రాంతాలలో కార్యకర్తలు కృషి చేయాలన్నారు. పార్టీకి కార్యకర్తలే పట్టుకోమని , కార్యకర్తల కృషి ఫలితంగానే కల్వకుర్తిలో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు సాధ్యమవుతుందన్నారు. చిన్న చిన్న పొరపాట్లు ఉంటే సర్దుకొని పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మనస్పర్దలతో పార్టీకి నష్టం చేకూరే పనులు ఏ కార్యకర్త , ఏ నాయకుడు చేయరాదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ విజయ జైపాల్ నాయక్ , పార్టీ మండల అధ్యక్షుడు, సర్పంచ్ భూపతిరెడ్డి , కల్వకుర్తి మున్సిపాలిటీ చైర్మన్ సత్యం , జెడ్పిటిసి విజితా రెడ్డి , సర్పంచులు వెంకటేశ్వరరావు గోరటి శ్రీనివాస్ , అంజయ్య ,శ్రీను నాయక్ , మాజీ ఎంపీపీ జయప్రకాష్ , మాజీ వైస్ ఎంపీపీ వెంకటయ్య గౌడ్, ఏఎంసీ చైర్మన్ విజయ్ గౌడ్, మహిళ నాయకురాలు ఆదిలక్ష్మి , నాయకులు గోపాల్ నాయక్, వెంకటేష్ ,యాదగిరి ,రవి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.