సైనికుల్లా పనిచేద్దాం గడ్డం ప్రసాద్‌ కుమార్‌ను గెలిపిద్దాం

– ప్రసాద్‌ కుమార్‌పై ఎమ్మెల్యే
– ఆనంద్‌ ఆరోపణలు సరికాదు
– మండలంలో 3 రోజులు మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ఎన్నికల ప్రచారం
– మండలాధ్యక్షుడు రవీందర్‌
నవతెలంగాణ-మర్పల్లి
మండలంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు నాయకులు సైనికుల్లా పనిచేసి మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ను అధిక మెజార్టీతో గెలిపించుకుందామని మండలాధ్యక్షుడు రవీందర్‌, బ్లాక్‌ 2 అధ్యక్షుడు కృష్ణారెడ్డి, జి రాములు, ఏం రామేశ్వర్‌లు అన్నారు. మండల కేంద్రంలో శని వారం విలేకరుల సమా వేశంలో వారు మాట్లాడు తూ..బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేను అబివృద్ధిపై గ్రామాల్లో ప్రజలు అడ్డు కుంటే గడ్డం ప్రసాద్‌ కుమార్‌పై అనుమానాలు వ్యక్తం చేయడం సరికాదని కాంగ్రెస్‌ కార్యకర్తలపై నాయకులపై వేధింపులకు దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని వారన్నారు. ప్రసాద్‌ కుమార్‌ పై అభిమానంతోనే ప్రజలు తండోపతండా లుగా ఆయన సమావేశాలకు హాజరై మద్దతు పలుకు తున్నారని అన్నారు. 29,30,31 తేదీల్లో మండలం లోని 11 గ్రామాల్లో జరిగే ఎన్నికల ప్రచారంలో మాజీమంత్రి ప్రసాద్‌ కుమార్‌ పాల్గొంటున్నారని కార్యకర్తలు నాయకులు పాల్గొని విజయవంతం చే యాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు జి రాములు యాదవ్‌, మర్రి కృష్ణారెడ్డి, నాగేష్‌, సంజీవ రెడ్డి, ప్రభాకర్‌, గోపాల్‌, ప్రభాకర్‌ రెడ్డి, సాయి కుమా ర్‌, నరసింహారెడ్డి, అబ్రహం, ఆనందం, నరసిం హారెడ్డి, రాఘవేందర్‌, సర్వేశ్వర్‌, జనార్ధన్‌ రెడ్డి, మల్లేష్‌ యాదవ్‌, వడ్ల వెంకట్‌, గోపాల్‌ నాయక్‌, అశోక్‌, లడ్డు తదితరులు పాల్గొన్నారు.

Spread the love