– చిన్నారుల మొహంలో చిరునవ్వులు చిందించేలా ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.
– జిల్లా ఎస్.పి. సిహెచ్. సింధు శర్మా ఐ.పి.ఎస్
నవతెలంగాణ – కామారెడ్డి
చదువుకోవాల్సిన, ఆడుకోవాల్సిన చిట్టి చేతులు బాల్యంలో వెట్టి చాకిరి చేస్తూ మగ్గిపోతున్నాయి. అట్టి చిన్నారి చేతులను వెట్టిచాకిరి పనుల నుండి విముక్తులను చేసి తిరిగి వారి ముఖంలో చిరునవ్వులను అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కార్యక్రమమే ఈ ఆపరేషన్ ముస్కాన్. ప్రతీ సంవత్సరం మాదిరిగానే 2024 సంవత్సరం జులై 1 వ తేదీ నుండి జులై 31వ తేదీ వరకు నెలరోజులుగా జరిగిన 10వ ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా కామారెడ్డి జిల్లాలో ప్రతి సబ్ డివిజన్ లో ఒక టీంను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి టీంలో ఒక ఎస్సై మహిళా కానిస్టేబుల్, చైల్డ్ ప్రొటెక్షన్, చైల్డ్ లైన్ , చైల్డ్ లేబర్ సంబంధిత అధికారులు ఉన్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ సబ్ డివిజన్ పరిధిలో ఏర్పడినటువంటి (3) మూడు ఆపరేషన్ ముస్కాన్ టీమ్స్ తో రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, జన సామర్థ్యం ఎక్కువగా ఉన్న ప్రదేశాలు, ఇటుకలు తయారు చేయు బట్టీలు, మిగతా పిల్లలు పని చేయు పరిస్థితుల్లో ఉన్న ప్రదేశాలను తనిఖీ చేసి మెత్తం (46) మంది 18 సంవత్సరాలలోపు పిల్లలను గుర్తించరు. వారిలో 39 మంది బాలురు కాగా 07 మంది బాలికలు ఉన్నారు. 2 కేసులు నమోదు చేయడం జరిగిందని అన్నారు.
46 మంది బాల కార్మికులకు విముక్తి.
సబ్ డివిజన్ లో వారిగా,
కామారెడ్డి, బాలురు 17 , బాలికలు 06, మొత్తం 23, ఎల్లారెడ్డి, బాలురు 10, బాలికలు 00, మొత్తం 10 బాన్సువాడ, బాలురు 12 , బాలికలు 01,మొత్తం 13, జిల్లా మొత్తంగా మొత్తం 46, చిన్నపిల్లలు వెట్టిచాకిరికి గురికాకుండా వారి మొహంలో చిరునవ్వులు చిందించేలా ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని సూచించారు. ప్రజలు ఎవరైనా బాలకార్మికులను పనిలో పెట్టుకున్న, లేక వారితో బలవంతంగా పని చేయించిన, ఒంటరిగా బాధపడుతున్న బాలలను చూసినప్పుడు, ఆశ్రయం అవసరమైన తప్పిపోయిన, వదిలివేయబడిన బాలలను చూసినప్పుడు, శారీరకంగా మానసిక, లైంగిక దోపిడికి గురవుతున్న బాలలను చూసినప్పుడు, హింసకు బెదిరింపులకు గురవుతున్న వీధి బాలలను చూసినప్పుడు, 1098 లేదా డయల్ 100, 112 కు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. ఆపరేషన్ ముస్కాన్ లో పనిచేసిన సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించరు.