దొరల కుటుంబ పాలన నుండి తెలంగాణకు విముక్తి

నవతెలంగాణ-మణుగూరు
దొరల కుటుంబ పాలన నుండి తెలంగాణకు 2023 ఎన్నికల ద్వారా విముక్తి లభించిందని ఈ విజయం ప్రజా విజయమని హెచ్‌ఎంఎస్‌ మణుగూరు ఏరియా బ్రాంచ్‌ సెక్రటరీ కోడిపల్లి శ్రీలత అన్నారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి తెలంగాణ ప్రజలు ఇచ్చిన బహుమతి అన్నారు. అలాగే తెలంగాణ అమరవీరులకు అంకితం అన్నారు. అలాగే పినపాక నియోజకవర్గం శాసన సభ గెలపొందిన పాయం వెంకటేశ్వర్లుకి హెచ్‌ఎంఎస్‌ మణుగూరు బ్రాంచ్‌ తరుపున శుభా కాంక్షలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అజారఖాన్‌, బ్రాంచ్‌ సెక్రటరీ బొల్లా కుమారస్వామి, చీఫ్‌ ఆర్గానేజ్‌ సెక్రటరీ రాములు, పీకే ఓసి పిట్‌ కార్యదర్శి రకీబ్‌, కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love