లైఫ్‌ ఇజ్‌ బ్యూటిపుల్‌

ఇల్లంతా సందడిగా వుంది ఇంటి ముందు రంగు రంగుల రంగవల్లులు,కొత్త రంగులతో ఇల్లంతా ఇంద్రభవనంలా కనిపిస్తుంది. బంధువుల హడావుడి, మామిడాకుల సరిగమలు,బంతిపూలు గుమ్మాల ముందు పదనిసలతో ఎంతో ఆహ్లాదంగా ఉంది. ఆరోజు సింధూజ పెళ్ళి. వారం ముందు నుంచే చుట్టాల హడావుడి మొదలైంది. నెల రోజుల ముందు నుండి సింధూజ అమ్మానాన్నలు ఫంక్షను హాలు అడ్వాన్సు,బుకింగ్‌, ఈవెంట్‌ ఆర్గనైజర్స్‌తో ఈవెంట్స్‌ గురించి, ఆరోజు మెనూ గురించి మాట్లాడడం బుకింగ్‌ చేసుకోవడం జరిగింది. బంధువుల లిస్ట్‌ రాయడం,బంగారం షాప్‌లో నగలు ఆర్డరు చేయడం, షాపింగ్స్‌తో క్షణం తీరిక లేకుండా పని చేసూనే వున్నారు.
సింధూజ వీూజ ఫిజిక్స్‌ కంప్లీట్‌ చేసి, ఒక జూనియర్‌ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తుంది. సింధూజ వాళ్ళ నాన్నగారు, రాజారావు గారు గవర్నమెంట్‌ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు. వాళ్ళ అమ్మగారు లకీë గృహిణి. సింధూజకి ఒక చెల్లెలు సహస్ర బిటెక్‌ ఫైనలియర్‌ చదువుతుంది.
”సింధూ ఈ రోజు నుండి నీ ఇంటి మారిపోతుంది. ఇల్లు మారిపోతుంది. కొత్త ప్రపంచం ఆహ్వానిస్తుంది కదా ఎలా అనిపిస్తుంది?” అడిగింది, సింధూ ఫ్రెండ్‌ లహరి ” అయినా, ఈ రోజు వరకే మనం, తర్వాత మనం గుర్తుంటామా! ” అంది, శ్రీజ ఆ మాటతో అందరూ గొల్లు మని నవ్వేశారు. సింధూ సిగ్గుల మొగ్గ అయ్యింది. లోపల బాధ,తల్లిదండ్రులను ఉన్న ఊరిని వదిలి వెళ్తున్నానమనే వ్యథను దిగమింగుకుంది.
రాహుల్‌ చేసి, ఇన్ఫోసిస్‌లో జాబ్‌ చేస్తున్నాడు. ఐదంకెల జీతం. ఒక్కగానొక్క కొడుకు. వాళ్ళ. నాన్నగారు, శ్రీనివాస్‌గారు బిల్డర్‌. రాహుల్‌ వాళ్ళ అమ్మగారు గృహిణి. బంధువుల ద్వారా ఈ సంబంధం కుదిరింది.
అనుకున్న దానికన్నా బాగా పెళ్ళి ఘనంగా జరిగింది. అప్పగింతల సమయం ఆసన్నమైంది. రాజారావు గారు తను కూతురు చేతిని అల్లుడు రాహుల్‌ చేతిలో పెట్టి, ”ఈ బంగారు బొమ్మ అయిన మా అమ్మను నీకిస్తున్నాను జాగ్రత్తగా చూసుకో అల్లుడు” అని, ఏడుస్తూ అప్పగించాడు. అక్కడ గంభీరమైన వాతావరణం నెలకొంది. కొన్ని నిముషాలు తేరుకున్న తర్వాత సింధూజ వాళ్ళ మేనత్తలకు బంధువులందరికీ, కాళ్ళకు దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుంటా ”వెళ్ళొస్తా” అని కన్నీళ్ళతో పలికింది.
అత్తగారి ఇల్లు, కొత్తగా అనిపించింది సింధూజకి. ”సింధూ టీ తీసుకుని రా” అంది, అత్తయ్య వరలకిë” సరే అత్తయ్యా వస్తున్నా” అని, పది నిముషాల్లో నలుగురికి టీ రెడీ చేసి,అందులోకి రస్క్‌ బిస్కెట్స్‌ ప్లేటులో పెట్టి తీసుకుని వెళ్ళి ఇచ్చింది. ”ఎలా అనిపిస్తుంది సింధూ ఇక్కడ” అన్నారు
వాళ్ళ మావయ్య శ్రీనివాస్‌ గారు. ”అమ్మానాన్న గుర్తుకు వస్తే చెప్పు,నాలుగు రోజులు వెళ్ళివద్దువుగానీ” అన్నా టీ తాగుతూ ” పర్వాలేదు మావయ్య రెండు రోజులు ఆగి వెళతాను, మీ అబ్బాయికి వీకాఫ్‌ వస్తుంది కదా!” అంది సింధూ, తలదించుకుని నెల రోజులు, రాహుల్‌ క్యాబ్‌లో అప్‌ Ê డౌన్‌ చేశారు, ఆఫీస్‌కి ఇంటికీ తర్వాత వేరు కాపురం పెట్టారు.
రాత్రి షిప్టు రాహుల్‌కి,సింధూజకి రోజంతా కాలేజ్‌తో ఇద్దరు క్షణం తీరిక లేకుండా పోయింది. ” రాహుల్‌ ఇంట్లో సరుకులు లేవు, మధ్యాహ్నం తీసుకుని రా ” నాకు లేటవుతుంది అంది సింధూజ. ” నాకు ఏమి చెప్పకు, నా హడావిడి నాకు ఉంది నువ్వు తెచ్చుకో లేకపోతే మానెరు నేను క్యాంటీన్‌లో తింటా” అన్నాడు రాహుల్‌. ఈ ”మాత్రం కూడా చేయవా? నేను వర్క్‌ చేస్తున్నా కదా! నేను,
ఖాళీగా లేను” అంది సింధూ, విసురుగా తప్పదని, సరుకులు ఈడ్చుకుంటూ తెచ్చి, డైనింగ్‌ టేబుల్‌ దగ్గర పెట్టింది. రాహుల్‌, క్రికెట్‌ మ్యాచ్‌ చూస్తూ ఎంజారు చేస్తున్నాడు.
”నన్ను డ్రాప్‌ చెయ్యవు, ఒక సినిమా లేదు,షికారు లేదు, నీ వరకు నువ్వు చూసుకుంటావు నేనెందుకు” అని, చేతిలో ఉన్న హ్యండ్‌బ్యాగును నేల మీద విసిరింది సింధూజ . ” నాషెడ్యూలు మార్చుకోను,నీ ఇష్టం అయితే వుండు లేకపోతే వదిలెరు”అని, రిమోట్‌ పగలగొట్డాడు రాహుల్‌ అట్లా రెండు గంటలు, ఎడతెగని గొడవతో ఆ రోజు రాహుల్‌ ఆఫీస్‌ బంక్‌ కొట్టి బార్‌కి,వెళ్ళాడు సింధూజ ఏడ్చుకుంటూ, బ్యాగులో బట్టలు సర్దుకొని పుట్టింటికి బయలుదేరింది. సాయంత్రం 6 గంటలకు అప్పటికి పెళ్ళై వాళ్ళకు ఆరు నెలలు.
నాన్న,రాజారావు గారు బస్టాండుకు వెళ్ళి సింధూజని బండి మీద తీసుకుని వచ్చాడు. ఆ రాత్రి ఏమీ అడగలేదు. వాళ్ళ అమ్మ ఏం జరిగిందో కనిపెట్టింది. కానీ ఏమి అనలేదు.
”ఉదయం 8 గం||లవుతోంది. సింధూ లేమ్మా టిఫిన్‌ చేద్దువుగాని” అంది లకీë ”వస్తా అమ్మా” అని, గబాగబా బ్రష్‌ చేసుకుని, స్నానం చేసి, టేబుల్‌ దగ్గరికి చేరింది 8.30గం||లకు అందరూ, ఒకేసారి టిఫిన్‌ చేసే అలవాటు. టిఫిన్‌ చేసి, చేతులు కడుక్కుని, టవల్‌తో చేతులు తుడుచుకుండగా, నా అల్లుడు గారు రాలేదమ్మా అని” అంది, లకీë టేబుల్‌ సర్దుతూ,సమాధానం లేదు, ముఖంలో రంగులు మారుతున్నాయి సింధూలో వాళ్ళ నాన్నగారు కనిపెట్టి, ”నైట్‌ షిప్ట్‌లో వున్నానని నాకు రాహుల్‌ ఫోన్‌ చేశాడు”,అంటూ లంచ్‌ బ్యాగు తీసుకుని బయలుదేరాడు. సింధూజ, కాలేజికి ఫోన్‌ చేసి,వారం రోజులు అర్జంట్‌ లీవ్‌ కావాలని అని తీసుకుంది.
”సింధూజ తల్లి కాబోతుందని తెలిసి, వాళ్ళ నాన్నగారు స్వీట్స్‌ తెచ్చారు”. సింధూ నేను రిటైర్‌ అవుతున్నాను అనే దిగులు పోయింది రా. నాకు తాత పోస్ట్‌తో ఇంకా బిజీ అవుతా అన్నారు రాజారావు గారు. ”నేను కూడా అంతే అంది” లకీë,స్వీట్లు పంచుతూ సహస్రకి ఫోన్‌ చేసి చెప్తా,అని. లకీë ఫోన్‌ కలిపింది. ”నేను ఈ ఆదివారం వస్తా మమ్మీ” అంది సహస్ర,రాహుల్‌కి చెప్పావా అమ్మా అన్నారు రాజారావు గారు. జవాబు లేదు. ”రాహుల్‌ ఫోన్‌ చేశాడా”,”ఊహూ” అంది సింధూ.
రాజారావు గారు వియ్యంకుడు శ్రీనివాస్‌కు ఫోన్‌ చేసి,శుభవార్త చెప్పగానే,చాలా సంతోషం బావగారు, ఇద్దరం ఒకేసారి తాతలం అవుతున్నాం,సింధూను మంచి డాక్టరు గారి దగ్గర చూపించండి. లేదంటే మేం వచ్చి,తీసుకుని వచ్చి ఇక్కడ చూయిస్తాం” అన్నారు శ్రీనివాస్‌గారు. భలే వారు బావగారు, కూతురి మొదటి కాన్పు నా బాధ్యత. మనవడినో,మనవరాలినో పువ్వుల్లో పెట్టి నీకు అప్పగిస్తాను” సరేనండీ అన్నారు రాజారావు గారు.
సింధూజకి పండంటి పాప పుట్టింది. శ్రీనివాస్‌ Ê వరలకీë ఆనందానికి అవధులు లేవు. వాళ్ళు చెప్పినందుకు, రాహుల్‌ మొహమాటానికి ఒకసారి హస్పిటిల్‌లో పాపను చూశాడు. సింధూను పలకరించలేదు. ఆ దూరం పెరుగుతూనే వస్తుంది.
విషయం ఇరుపెద్దలకి అర్థమైంది. ఎంతైనా ఎన్నో ఆటుపోట్లు,ఎదుర్కొన్నవాళ్ళు. ఈ సమస్యను అందరూ కలిసే పరిష్కరిం చాలని నిర్ణయించుకున్నారు.
మూడవ నెల సింధూని, అత్తవారు వచ్చి,మెట్టింటికి తీసుకుని వెళ్ళారు. రాహుల్‌ను బలవంతంగా తను వుండే రూం ఖాళీ చేయించి, వాళ్ళ దగ్గరే వుంచుకున్నారు. నైట్‌ షిప్ట్‌లు మాన్పించారు.
”రాహుల్‌ పాప ఏడుస్తుంది ఎత్తుకో”, షేవింగ్‌ చేసుకుంటూ అన్నారు శ్రీనివాస్‌. సింధూ వంట చేస్తుంది. బొమ్మలు ఇచ్చి,ఇటూ,అటూ తిప్పాడు. మరుసటి రోజు ”మావయ్య పాపకి ఒళ్ళు కాలిపోతుంది.
హాస్పటిల్‌కి వెళ్ళాలి” అంది సింధూ, పాపను చూపిస్తూ. ఏరా రాహుల్‌, పిల్లని కనడం కాదురా, వాళ్ళను జాగ్రత్తగా చూసుకోవాలి. ఫస్ట్‌, ఆసుపత్రికి తీసుకుని వెళ్ళ గట్టిగా గదమాయించే సరికి,వెంటనే కారు తీసుకుని బయలుదేరాడు. భార్య పాపతో ఆసుపత్రికి వచ్చింది.
”రాహుల్‌ , ఇలా రా” అని కొడుకు ప్రక్కన కూర్చుని, ”ఎందుకొచ్చినా ఈగోలు రా ఇవ్వన్నీ? వాళ్ళింట్లో,సింధూ వాళ్ళకి దేవత నీ కూతుని లాగా. ఇరవై ఏళ్ళు పెంచి, ఎన్నో ఆశలతో నీకు అప్పచెప్పితే, ఆ అమ్మాయిని గురించి ఒక్కసారి అయినా, తన వైపు ఆలోచించావా, ఇక్కడ ఎవరి కోసం వుండాలి తను, పాప కోసమా? పరువు కోసమా? బంధం కోసమా? మా అమ్మా నాన్న మాకు చెప్పింది ఒక్కటే, ”బంధం” అనేది బరువు కాదు అని నీ కోసం ఎవరు వుండరు, మాతో సహా, మీ కూతురితో సహా,భార్యాభర్తలే చివరికి మిగిలేది. మన భారతీయ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ ప్రపంచానికే ఆదర్శం. ఉమ్మడి కుటుంబాలు దూరం అవుతున్న కొద్దీ,భార్యభర్తలు చెదురుమదురు అవుతున్నారు. పెద్దవాళ్ళ మీద గౌరవం వుంచి, నీ కోసం ఎదురు చూస్తున్న భార్యను వదులుకోకు. డబ్బు,ఉద్యోగం, అందం,ఆస్తి వస్తాయి,పోతాయి. బంధాలు ప్రేమ పెంచుకోవాలి” అని చెప్పి శ్రీనివాస్‌ పని మీద బయటికి వెళ్ళాడు.
”సింధూ టీ పెట్టూ పిలుపుతో” సడన్‌గా లేచింది సింధూ. అది రాహుల్‌ గొంతు.
”సరేనండి” అని కిచెన్‌లోకి వెళ్ళింది.
– మాద నాగాంజలి, 96400 98344

Spread the love