కస్తూర్బాలో జీవన నైపుణ్యాలు, మానసిక ఆరోగ్యంపై శిక్షణ కార్యక్రమం

నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో శనివారం విద్యార్థినిలకు జీవన నైపుణ్యాలు, మానసిక ఆరోగ్యం మార్గదర్శక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఐసీడీఎస్ భీంగల్ ప్రాజెక్టు పరిధిలోని కమ్మర్ పల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మహిళా శిశు దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో బేటి బచావో, బేటి పడవో పథకంలో భాగంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.ఈ  శిక్షణ కార్యక్రమానికి ఐసీడీఎస్ భీంగల్ ప్రాజెక్టు ఏసీడీపీఓ జ్ఞానేశశ్వరి, బాలల పరిరక్షణ అధికారి నెగెల్లి బాబు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ శిక్షణ కార్యక్రమానికి ఏఆర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ, సైకాలజిస్ట్ కే.సునీత  విచ్చేసి విద్యార్థినిలకు జీవన నైపుణ్యాల గురించి, మానసిక ఆరోగ్య పరిస్థితుల గురించి వివరించారు. వివిధ ఆక్టివిటీస్ ద్వారా మానసిక ఒత్తిడిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, పరీక్ష సమయంలో నేర్చుకున్న దానిని ఎలా ప్రజెంట్ చేయాలి అనే విషయాలపై  విద్యార్థినిలకు సవివరంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు మండల పర్యవేక్షకురాలు సరస్వతి, అంగన్వాడీ టీచర్స్ యమున, దివ్య, మంజుల, జమున, మహిళా సాధికారత కేంద్రం నిజామాబాద్ జెండర్ స్పెషలిస్ట్ సౌమ్య, జెండర్ స్పెషలిస్ట్ కవిత, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ప్రత్యేక అధికారిని  గంగామణి,  ఉపాధ్యాయ బృందం, విద్యార్థినిలు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love