శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

నవతెలంగాణ హైదరాబాద్‌: రాష్ట్రంలో శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ శుక్రవారం తెలిపింది. తెలంగాణపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా అక్కడక్కడ వర్షపు జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. మరోవైపు రాష్ట్రంలో మూడు రోజులుగా పగటిపూట ఉష్ణోగ్రతలు ఖమ్మం, నల్గొండ మినహా మిగిలిన ప్రాంతాల్లో సాధారణ స్థాయిలోనే నమోదవుతున్నాయి. రాత్రిపూట ఖమ్మం, హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో సాధారణం కన్నా రెండు డిగ్రీలు ఎక్కువగా నమోదవుతున్నాయి.

Spread the love