నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలంలో ఖరీఫ్ సీజన్లో రైతన్నలు దుక్కులు తిని వరి నాట్లకు సిద్ధం చేసుకున్నారు. కొంతమంది వ్యవసాయ బోరుబావుల వద్ద వరి నాట్లను ప్రారంభించారు. ప్రారంభంలోనే ఎకరానికి రూ.3300 చొప్పున మహిళలు వరి నాట్లు వేస్తున్నారని రైతులు పేర్కొన్నారు. మరో 10 రోజులలో నాట్లకు మహిళలు కరువవడంతో రూ.4000 నుంచి రూ.4500 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందని రైతులు ముందుగానే నాట్లను ప్రారంభించారు. మండలానికి పెద్ద భూస్వాములు మాత్రం హర్యానా ,బెంగాల్, తదితర రాష్ట్రాల నుంచి మగవారి కి అడ్వాన్సుగా కొన్ని డబ్బులు ముట్ట జెప్పి వారికి ఇక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. వారి రాకతో కూలి రేట్లు పెరిగే అవకాశం ఉందని రైతాగం పేర్కొంటుంది.