పాత చింతకాయ పచ్చడిలా….

– టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మెన్‌ మధుయాష్కీ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
వరంగల్‌ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ పాత చింతకాయ పచ్చడిలాగా చెప్పేవే చెప్పారంటూ టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మెన్‌ మధుయాష్కీ ఎద్దేవా చేశారు.శనివారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన మాట్లాడారు. ‘కేసీఆర్‌ జుటా, మోడీ జుటా దోనో మిల్కే దేశ్‌ కో లూటా’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం తెచ్చిన ప్రతి బిల్లుకి బీఆర్‌ఎస్‌ మద్దతిచ్చిందని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ అవినీతి గురించి మాట్లాడుతున్న మోడీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రావద్దనే కుట్రతోనే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఒకటని మోడీ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌, బీజేపీనీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు బొంద పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

Spread the love