మంత్రి కేటీఆర్‌ను కలిసిన లింబాద్రి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఐటీ, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె తారక రామారావును తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (టీఎస్‌సీహెచ్‌ఈ) చైర్మెన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌ లింబాద్రి మంగళవారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. లింబాద్రిని రెగ్యులర్‌ చైర్మెన్‌గా రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నియమించిన విషయం తెలిసిందే. ఆయనకు మంత్రి కేటీఆర్‌ శుభాకాంక్షలు ప్రకటించారు. రాష్ట్రంలో ఉన్నత విద్యాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. తప్ప కుండా కృషి చేస్తామని మంత్రికి లింబాద్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మెన్‌గా నియమితులైన ఎస్‌కే మహమూద్‌ కూడా పాల్గొన్నారు.

Spread the love