నవతెలంగాణ – గోవిందరావుపేట
మండల కేంద్రంలోని గోవిందరావుపేట వన్ అంగన్వాడీ కేంద్రంలో గురువారం మాదరబోయిన దీక్షిత్ తల్లి సంధ్యారాణి ఆధ్వర్యంలో దీక్షిత్ కు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అంగన్వాడీ టీచర్ ఎం విజయలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమానికి మాలగడ్డ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జక్కు మన్నెమ్మ మరియు ఉపాధ్యాయులు సంతోశ్ కుమార్ హాజరై బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐదు సంవత్సరాలు దాటిన పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లులకు సూచించారు. ప్రస్తుతం ప్రైవేటు పాఠశాలలకు దీటుగా సకల సౌకర్యాలతో ఆంగ్ల మాధ్యమంతో బోధన సాగిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం ఉచితంగా కల్పిస్తున్న ఈ సదుపాయాలను ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పలువురు గర్భిణీ స్త్రీలు తల్లులు పిల్లలు అంగన్వాడి ఆయా తదితరులు పాల్గొన్నారు.