నవతెలంగాణ – రెంజల్
మండల కేంద్రమైన రెంజల్ ప్రైమరీ పాఠశాలలో శుక్రవారం ఎంపీపీ రజనీకిషోర్, ఎంపీడీవో హెచ్. శ్రీనివాస్, చిన్నారులకు అక్షరాభ్యాసం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిరుపేద విద్యార్థుల కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తూ, మౌలిక సదుపాయాలను కల్పించడమే కాకుండా, నాణ్యమైన విద్యా బోధన, ఆంగ్ల మాధ్యమం బోధిస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థి తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. విద్యార్థిని విద్యార్థులకు ఏకరూప దుస్తులు, ఉచిత పాఠ్య పస్తకాలు, మధ్యాహ్న భోజనం అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ గణేష్ రావు, ఎంపీ ఓ గౌస్ ఉద్దీన్, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు ఆంజనేయులు, పి ఆర్ టి యు మండల అధ్యక్ష కార్యదర్శులు టి. సోమలింగం గౌడ్, సాయ రెడ్డి, ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనురాధ, ఎమ్మార్పీ సుమలత, ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అధ్యక్షురాలు తదితరులు పాల్గొన్నారు.