మియాపూర్‌లో అక్రమ నిర్మాణాలు

ప్రభుత్వ భూమిలో ప్రయివేట్‌ వ్యక్తుల కంటైనర్లు
పట్టించుకోని పాలకులు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్‌ డివిజన్‌ 100 సర్వే నెంబర్‌లో రోజుకొక్కటి అక్రమ నిర్మా ణాలు వెలుస్తున్నాయి. ఎప్పటినుంచో వివాదాల్లో ఉన్న ఈ సర్వే నెంబర్‌లో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ సీనయ్య దగ్గరుండి ప్రోత్సహిస్తున్నారని అనడానికి ఈ నిర్మాణాలే నిదర్శనం. 30 ఏండ్ల క్రితం కొన్న సొంత స్థలంలో చిన్న రూములు వేసుకుంటేనే క్షణాల్లో వాలిపోయే రెవెన్యూ సిబ్బంది, స్లాపులు వేసి నిర్మాణాలు చేపడుతున్నా, స్పందించక పోవడం గమనార్హం. ఇదే ఏరియాలో ఇద్దరూ వీఆర్‌ఏలు ఉన్నా పట్టించుకోవడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. అధికారులు ముడుపులు తీసుకుని, వారిని ప్రోత్స హిస్తునారని స్థానికుల ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏడాది కాలంలోనే ఈ ప్రాంతంలో అనేక నిర్మాణాలు వెలి శాయి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే, ఆ ప్రభుత్వ స్థలంతో మీకేం పని అంటూ దురుసుగా సమాధానం చెబుతున్నారని స్థాని కులు చెబుతున్నారు. రెవెన్యూ ఇన్‌ స్పెక్టర్‌ సీనయ్య వచ్చి నప్పటి నుంచే అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారని పలువురు ఆరోపించారు. ఇందులో కింద స్థాయి సిబ్బంది చేతివాటం కూడా కనిపిస్తుందనీ, అందుకే నిర్మాణాలు జరిగే సమయంలో ఈ దరిదాపుల్లో కనిపించడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఒక్కొక్క నిర్మాణానికి రూ.10 లక్షల ఖర్చు వస్తుందనీ, తెలిపారు. న్యాయం వ్యవస్థను కూడా తప్పుదోవ పట్టిస్తూ కోట్లు గండిస్తున్నారు. కొంత మందికి మాత్రం సుప్రీం కోర్టు పరిధిలో ఉందని చెబుతూ అక్రమ నిర్మాణ దారులను ప్రోత్సహిస్తున్నారని విమర్శి స్తు న్నారు. ఈ ఇప్పటికైనా రెవెన్యూ సిబ్బంది స్పందించి నిర్మా ణంలో అడ్డుకోవాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు.

Spread the love