నవతెలంగాణ- రామారెడ్డి : క్రీడలు మనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపునిస్తాయని, వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని శనివారం స్థానిక ఎస్సై కే సుధాకర్ అన్నారు. మండలంలోని ఉప్పల్వాయి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల /కళాశాలలో 9వ రాష్ట్రస్థాయి బాలుర క్రీడల పోటీలను ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. జ్యోతి ప్రజ్జాలన తర్వాత క్రీడలను ప్రారంభించారు. కార్యక్రమంలో నిజామాబాద్ రీజినల్ కోఆర్డినేటర్ కె అలివేలి, రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల క్రీడల అధికారి రామ్ లక్ష్మణ్, నోడల్ అధికారి షేక్ సలాం, ప్రిన్సిపల్ సత్యనారాయణ, వైస్ ప్రిన్సిపాల్ సురేందర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ కొత్తొల్ల గంగారం, రైతుబంధు అధ్యక్షులు నారాయణరెడ్డి, ఉప సర్పంచ్ సరస్వతి తదితరులు పాల్గొన్నారు.