నెక్సస్ హైదరాబాద్ మాల్లో ‘లాక్ ది బాక్స్’ బుక్ ఫెయిర్

– ఈ ప్రదర్శన ఈనెల‌ 18 నుంచి 24వ తేదీ వరకు..
నవతెలంగాణ హైదరాబాద్: పుస్తక ప్రియులకు పండగే. సాహిత్యాభిమానులకు సంతోషకరమైన విషయమే. ఎందుకంటే, నెక్సస్ హైదరాబాద్ మాల్లో ‘లాక్ ది బాక్స్’ బుక్ ఫెయిర్ ఈనెల‌ 18 నుంచి 24వ తేదీ వరకు జరగనుంది. ఈ విషయాన్ని నెక్సస్ హైదరాబాద్ మాల్ ప్రకటించింది. బుక్‌చోర్.కామ్ ఈ పుస్తక ప్రదర్శన నిర్వహిస్తుంది. భారతదేశంలో ఎలాంటి పుస్తకాలైనా చవక ధరలకు అందించడంలో బుక్‌చోర్.కామ్ ప్రసిద్ధి. బుక్‌చోర్.కామ్ 2015లో ప్రారంభమైంది.‌‌‌‌ పుస్తకాలను తక్కువ ధరలకు అందించేందుకు కృషి చేస్తుంది. ఫిక్షన్ నుంచి నాన్-ఫిక్షన్, పిల్లల పుస్తకాల వరకు అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. ఈ ప్రదర్శనలో స్టార్ బక్స్, యూమీ నుంచి ప్రత్యేక తగ్గింపు కూపన్ల కూడా పొందవచ్చు. ఈ కూపన్లు బుక్ ఫెయిర్‌లో బ్రౌజ్ చేస్తున్నప్పుడు రిఫ్రెష్ కాఫీని ఆస్వాదించవచ్చు. ఈ అద్భుతమైన అవకాశాన్ని మిస్ కాకండి.

Spread the love