‘ఫైనాన్స్ బిల్లు’కు లోక్‌సభ ఆమోదం..

నవతెలంగాణ – హైదరాబాద్: ఫైనాన్స్ బిల్లు – 2024కు 45 సవరణలతో లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఇందులో రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి LTCGలో 2 ఆప్షన్స్‌ను కేంద్రం తీసుకొచ్చింది. ఇండెక్సేషన్‌తో కూడిన 20శాతం లేదా 12.5శాతం పన్నును ఎంచుకునే విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అనంతరం స్పీకర్ ఓంబిర్లా సభను రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు.

Spread the love