లోకేష్‌కుమార్‌ కృషి అభినందనీయం :

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎమ్‌సీ) కమిషనర్‌గా పనిచేసి, బదిలీ అయిన ఐఏఎస్‌ అధికారి లోకేష్‌కుమార్‌ను పురపా లకశాఖ మంత్రి కే తారకరామారావు అభినందిం చారు. సుదీర్ఘకాలం ఆయన జీహెచ్‌ఎంసీకి సేవలు అందించారని చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల విజయం వెనుక ఆయన కృషి ఉన్నదని ప్రసంసించారు. ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా నగరంలో మౌలిక వసతుల కల్పన, ప్రజా రవాణాను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన ఎస్‌ఆర్‌డీపీ,లింక్‌ రోడ్ల నిర్మాణం, ఎస్‌ఎన్‌డీపీ వంటి వ్యూహాత్మక కార్యక్రమాలను విజయవంతం చేయడంలో భాగస్వామిగా ఉన్నారని చెప్పారు. ఈ సందర్భంగా లోకేష్‌కుమార్‌ను శాలువాతో సన్మానిం చి, జ్ఞాపికను బహుకరించారు. కార్యక్రమం లో గ్రేటర్‌ హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌, జలమండలి ఎమ్‌డీ దానకిషోర్‌, జీహెచ్‌ఎంసీ నూతన కమిషనర్‌ రోనాల్డ్‌ రాస్‌, మెట్రో రైల్‌ ఎండి ఎన్వీఎస్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.మంత్రి కేటీఆర్‌

Spread the love