లారీలు వచ్చేది ఎన్నడూ… మక్కలు ఎగుమతి చేసేది ఎప్పుడో..

కొనుగోలు కేంద్రాల వద్ద నిరీక్షిస్తున్న రైతులు పట్టించుకోని అధికారులు
గన్నీ సంచుల భారం రైతుపైనే మక్కల రేటు తగ్గించిన ప్రైవేటు వ్యాపారులు
నవతెలంగాణ-శాయంపేట
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన మొక్కజొన్న పంటను మార్క్‌ ఫెడ్‌ ద్వారా క్వింటాల్‌కు1965 మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తామని ప్రక టించడంతో గిట్టుబాటు ధర వస్తుందని రైతులు మక్కలను పీఎసీఎస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రానికి తీసుకురాగా, లారీల కొరతతో ఒక్కో రైతు 20 రోజులకు పైబడి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులుగాస్తున్న దుస్థితి నెల కొంది. రైతులు ఆరుగాలం శ్రమించి మొక్కజొన్న పంట సాగు చేయగా పంట చే తికి రాగా ప్రైవేటు వ్యాపారులు క్వింటాల్‌కు రూ.1700 నుండి 1800 చొప్పున కొనుగోలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం మార్కెఫెడ్‌ ద్వారా మక్కలు కొనుగోలు చేస్తామని ప్రకటించగా శాయంపేటలో పీఎసీఎస్‌ ఆధ్వర్యంలో మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయగా మే 8న ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రారంభిం చారు. దీంతో రైతులు మద్దతు ధర లభిస్తుందని కొనుగోలు కేంద్రాలకు తీసుకురా గా నిర్వాహకులు గన్నీ సంచులు ఇవ్వకపోవడంతో రైతులే స్వచ్ఛందంగా సంచు లు కొనుగోలు చేసుకుని తూకానికి సిద్ధం చేశారు.
రవాణా కొరత ఉండడంతో కొనుగోలు కేంద్రంలో మక్కల బస్తాల నిల్వలు వేలసంఖ్యలో పేరుకుపోయాయి. నిర్వాహకుల దగ్గరి సంబంధీకులు, రాజకీయా లలో ఉన్న రైతుల మక్కలను ముందుగా తూకంవేసి ఎగుమతి చేస్తున్నారని రై తులు ఆరోపిస్తున్నారు. మంగళవారం ఉదయం కురిసిన వర్షానికి మక్కల బస్తాలు తడిసి ముద్దయ్యాయి. రైతులు టార్ఫాలిన్‌ కవర్లు కప్పి, బస్తాల చుట్టూ మట్టితో కట్టలు కట్టి బస్తాలను తిరిగేసి ఆరబెట్టుకున్నారు.
ధర తగ్గించిన ప్రైవేటు వ్యాపారులు
రైతులు విడతల వారీగా మొక్కజొన్న పంట సాగు చేయడంతో ముందుగా వచ్చిన పంటను ప్రైవేటు వ్యాపారుల వద్ద రూ.1700 నుండి 1800 కు క్వింటాల్‌ చొప్పున మక్కలను అమ్ముకున్నామని, పీఎసీఎస్‌ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయగా మద్దతు ధర వస్తుందని ఇక్కడికి రాగా తూకమైనప్పటికీ రవాణా కాక కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొందని రైతులు తెలుపు తున్నారు. ప్రస్తుతం మక్కలను ప్రైవేట్‌ వ్యాపారులకు అమ్ముకుందామంటే క్వింటా ల్‌కు రూ.1600 మాత్రమే చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నిర్వా హకులు గన్నీ సంచులు కూడా సరఫరా చేయకపోవడంతో రైతులే స్వచ్ఛందంగా గన్నీ సంచులు కొనుగోలు చేసి మక్కలు నింపి విక్రయిస్తున్నట్లు తెలిపారు. గన్నీ సంచులు రాగానే రైతులకు అందజేస్తామని నిర్వాహకులు తెలుపుతున్నట్లు తెలిపా రు. గత్యంతరం లేక రైతులు కొనుగోలు కేంద్రంలోని చెట్ల నీడన సేద తీరుతూ పడిగాపులు కాస్తున్నారు.
లారీల రవాణా విషయమై పీఎసీఎస్‌ సీఈఓ రాజమోహన్‌ను వివరణ కోర గా ఇప్పటివరకు రూ.11,600 బస్తాలను రవాణా చేశామని, మరో రెండు వేల బస్తాలు తూకం వేసి ఉన్నాయని, తూకం వేయని బస్తాలను కూడా అతి త్వరలో తూకం వేయించి ఎగుమతి చేస్తామని తెలిపారు.
22 రోజులుగా పడిగాపులు : సిరిపురపు సరోజన, రైతు మైలారం
తమకున్న నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న పంటసాగు చేయగా ముందుగా 87 బస్తాలు రావడంతో గత 22 రోజుల క్రితం కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తే 15రోజుల క్రితం తూకం వేశారు. వారం క్రితం 115 బస్తాలు తీసుకురాగా ఇప్ప టివరకు తూకం వేయలేదు. నిర్వాహకులు తెలిసిన రైతులకు, బంధువులకు, రాజ కీయ నాయకుల మక్కల బస్తాలు ఇటీవల తీసుకురాగా వారివి ఎగుమతి చేశారు. మక్కలబస్తాలు తూకం వేయగానే సీరియల్‌ నెంబర్‌టోకెన్స్‌ జారీచేసి, వాటి ఆధా రంగా ఎగుమతి చేయాలి. ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలోకి లారీలు వస్తే దిగబడతాయని రోడ్డుపైనే నిలిపివేస్తున్నారు. కొనుగోలు కేంద్రం నుండి ట్రాక్టర్లలో బస్తాలు నింపి లారీల వద్దకు తీసుకెళ్తే లోడ్‌ చేస్తున్నారు. దీంతో రైతుకు బస్తాకు రూ.20లు అదనపు ఖర్చు వస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి తూకం వేసిన బస్తాలను వెంటనే రవాణా చేసి రైతుల కష్టాలు తొలగించాలి.

Spread the love