జింకల బెడదతో పంటల నష్టం

– తలలు పట్టుకుంటున్న వ్యవసాయ రైతులు

నవతెలంగాణ మద్నూర్
మద్నూర్ మండలంలోని శివారు ప్రాంతంలో జింకల బెడద అధికంగా కావడం వానాకాలం పంట సాగు మొలకెత్తిన పంటలను నష్టం కలిగించడంతో వ్యవసాయ రైతులు జింకల బెడద ఆందోళనలతో తలలు పట్టుకుంటున్నారు వందల సంఖ్యలో జింకల మందలు శివారు ప్రాంతాల్లో అధికంగా ఉండడం మొలిచేచ్చిన పంటలను నష్టం కలిగిస్తున్నాయి వేలాది రూపాయలు విత్తనాలు ఎరువులు కొనుగోలు చేసి సాగు చేసిన పంటలు మొలకెత్తగానే జింకలకు మేతగా మారడం పంటలు భారీగా నష్టపోతున్నాయి జింకల మందలను కాపల కాయడానికి రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఒకటి రెండు కాదు వందల సంఖ్యలో జింకలు మందలు మందలుగా ఉండటం ఏ చేనులో పడిన ఆ మందలతో ఆ చేను పంట పూర్తిగా నష్టానికి గురి అవుతుంది జింకల మందలను ఫారెస్ట్ శాఖ అధికారులు అరికట్టాలని పంట నష్టాలను కాపాడాలని మండల రైతులు కోరుతున్నారు
Spread the love