నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాదికి నష్టం

– 11న కొత్తగూడెంలో ప్రజాగర్జన సభ
–  పార్లమెంటు ఎన్నికల నాటికి లౌకిక పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలి :
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
దేశంలో నియోజకవర్గాల పునర్వి భజనతో దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు చెప్పారు. క్రమశిక్షణ, జనాభా నియంత్రణ, చదువులో పురోగతి, ఇతర అభ్యుదయ చర్యలుండడంతో తక్కువ సీట్లు పెరుగుతాయని వివరించారు. ఉత్త రాదిలో ఎక్కువ జనాభా కారణంగా ఎక్కువ లోక్‌సభ స్థానాలు పెరుగుతా యన్నారు. ఈ వివక్షతో అసంతృప్తి పెరిగి దక్షిణ భారతదేశం డిమాండ్‌ వచ్చే ప్రమాదముందన్నారు. సహేతు కమైన రీతిలో లోక్‌సభ స్థానాల పునర్విభజన జరగాలని కేంద్ర ప్రభు త్వాన్ని ఆయన డిమాండ్‌ చేశారు. గురువారంహైదరాబాద్‌లోని మఖ్దూం భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనివార్య పరిస్థితుల్లో ‘సిపిఐ ప్రజా గర్జన’ సభ తేదీని మార్చామని అన్నా రు. ఈనెల నాలుగో తేదీకి బదులుగా 11న కొత్తగూడెంలో లక్ష మందితో సభను నిర్వహిస్తామని చెప్పారు. సింగరేణి యాజమాన్యం వైఖరితోనే తేదీని మార్చాల్సి వచ్చిందన్నారు. ప్రభుత్వ పెద్దలు చెప్పినా మార్చాలం టూ ఒత్తిడి తెచ్చారని, ఇది అప్రజా స్వామికమని విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా పార్లమెంటు ఎన్నికల నాటికి లౌకిక, ప్రజాతంత్ర పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాలని కోరారు. జాతీయ స్థాయిలో నితీష్‌కుమార్‌, మమతా బెనర్జీ, కేజ్రీవాల్‌, అఖిలేష్‌ యాదవ్‌, తేజస్వీ యాదవ్‌ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. ఉద్యమాలు చేస్తున్న వారితో సీఎం కేసీఆర్‌ మాట్లాడాలని సూచించారు. వారిని పిలిచి బాధలు విని వాటిని పరిష్కరించాలని కోరారు. పోడు పట్టా లిస్తామనడం మంచిదేనని, అసెంబ్లీ లో సీఎం కేసీఆర్‌ ప్రకటించి నట్టుగా 11 లక్షల ఎకరాలకు ఇస్తా మని చెప్పి ఇప్పుడు నాలుగు లక్షల పరిమితం చేయడం సరైంది కాద న్నారు. ఆర్టీసీ, సింగరేణిలో కార్మిక సంఘ ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం తెలంగాణ అవతరణ దినోత్స వాలను తమ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. రాజ దండం ద్వారా దేశంలో రాచరిక, భూస్వామ్య వ్యవస్థను ప్రవేశ పెడ తారా?అని ప్రధాని మోడీని ప్రశ్నిం చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పశ్య పద్మ, టి శ్రీనివాసరావు, కలవేన శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Spread the love