ప్రేమించాడు…పెండ్లి చేసుకున్నాడు…మోసం చేసిండు!

– చందుర్తి మండలంలో ఘటన
నవతెలంగాణ-చందుర్తి : ఓ మహిళను పరిచయం చేసుకున్నాడు ఓ వ్యక్తి. ఆ పరిచయం ప్రేమగా మారింది. ఆ ప్రేమ పెండ్లి దాకా దారి తీసింది.కాపురం కూడా సాగింది.మున్నాళ్ల ముచ్చటగా సంసారం కూడా పెట్టారు. వ్యామోహం తిరకా  చివరికి  నువ్వు అంద హీనంగా ఉన్నవని ఆమెను చివరికి గెంటి వేసాడు.
ఈ హృదయ విధారక ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లాకు చెందిన ఓ ముస్లిం మహిళ తన ఇంట్లో గొడవ పడి వేములవాడకు వచ్చింది  బాంగిల్స్ స్టార్ లో జీతం కుదుర్చుకుని ఉండగా చందుర్తి మండలం లింగంపేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తరచు  ఆ షాప్ వద్దకు వెళ్లి మహిళతో పరిచయం చెలుకున్నాడు. దింతో ఆ పరిచయం ప్రేమగా మారింది పెండ్లిదాక వెళ్ళింది. ఆర్య సమాజ్ లో హిందు సంప్రదాయంగా ఆ ముస్లిం. మహిళను వివాహం చేసుకున్నాడు. హైదరాబాద్ లో గత ఆరు నెలలు గా కాపురం కూడా పెట్టారు.
ఇక నువ్వు వద్దు అంటున్న భర్త
నువ్వు అందంగా లేవు ఇక నువ్వు వద్దు నాకు అని రోజు వేధింపులకు గురి చేస్తూ కొట్టడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత హైదరాబాద్ నుండి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి చెప్పకుండా స్వగ్రామం వచ్చాడు. దింతో ఆ మహిళ వెతుక్కుంటూ లింగంపేట వచ్చి నిలదీయగా ఎక్కడ చెప్పుకుంటావో ,చెప్పుకో అని ఆమెను గెంటి వేయగా సదరు మహిళ చందుర్తి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసింది.
పోలీసులకు.పిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు..?
జరిగిన విషయంపై పోలీసులకు చెప్పి సార్ తమకు న్యాయం చేయండి అని పిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని బాధిత మహిళ  వాపోయింది. దింతో పెళ్లి చేసుకొని తమను మోసం చేసిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని న్యాయం కోసం ఆ మహిళ దిక్కుతోచని విదంగా తిరుగుతుంది. ఇప్పటి కైనా మానవ దృక్పధంతో  న్యాయం జరిగే విదంగా పోలీసులు చర్యలు తీసుకోవాలి.

Spread the love