నవతెలంగాణ – హైదరాబాద్: గత 5 రోజులగా బంగారం రోజులు బంగారం ధర పెరిగింది. 5 రోజుల వ్యవధిలో దాదాపు రూ.1200 వరకు పెరిగింది. అయితే మళ్లీ పెరుగుతుందనుకుంటున్న క్రమంలో ఇవాళ ఊరట ఇచ్చింది. గురువారం రోజు బంగారం ధరల్లో ఎలాంటి మార్పు కనిపించలేదు. ప్రస్తుతం హైదరాబాద్, ఢీల్లీ సహా ఇతర ప్రాంతాల్లో స్థిరంగా ఉన్నాయి. అయితే ఇంటర్నేషనల్ మార్కెట్‌లో మాత్రం గోల్డ్, సిల్వర్ రేట్లు తగ్గాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1875 డాలర్ల వద్ద కొనసాగుతోంది. స్పాట్ సిల్వర్ ధర 22 డాలర్ల లెవెల్స్‌లో ఉంది. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 83.198 వద్ద ట్రేడవుతోంది.దేశీయ మార్కెట్లలో చూస్తే హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములపై స్థిరంగా రూ.53,650 వద్ద కొనసాగుతోంది. కిందటి రోజు ఇది రూ. 300 పెరిగింది. అక్టోబర్ 5న రూ. 52,400 వద్ద ఉండగా.. ప్రస్తుతం రూ. 53,650 వద్ద ఉంది. ఇక 24 క్యారెట్స్ స్వచ్ఛమైన పసిడి రేటు 10 గ్రాములకు రూ. 58,530 వద్ద ట్రేడవుతోంది. దేశ రాజధాని దిల్లీ మార్కెట్‌లో బంగారం ధర 22 క్యారెట్లపై రూ. 53,800 వద్ద ఉండగా.. 24 క్యారెట్స్ గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 58,680 వద్ద కొనసాగుతోంది. బంగారం ధర స్థిరంగా ఉన్నప్పటికీ వెండి ధరలు పడిపోయాయి. దిల్లీ మార్కెట్‌లో ఇవాళ సిల్వర్ రేటు రూ. 500 తగ్గగా కేజీకి రూ.72,100 వద్ద ఉంది. హైదరాబాద్ మార్కెట్లోనూ వెండి ధరలు పతనమయ్యాయి. కిలోకు రూ. 500 తగ్గగా ఇప్పుడు సరిగ్గా రూ. 75 వేల మార్కు వద్ద ఉంది.