నవతెలంగాణ-బెజ్జంకి
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో యువకుల అత్మహత్యలతో రాజకీయ పబ్బం గడిపిన చరిత్ర అనాటి టీఆర్‌ఎస్ పార్టీదనిచ, ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దనే గొప్ప సంకల్పంతో తెలంగాణ రాష్ట్రమిచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేననిచ రాష్ట్రమిచ్చిన పార్టీని ఆదరించడం మన విధేయతని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మానకొండూర్ నియోజకవర్గ ఇంచార్జీ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. సోమవారం మండల పరాధిలోని దాచారం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కవ్వంపల్లి హజరై కాంగ్రెస్ పార్టీ జెండావిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల అత్మగౌరవం కోసమే తుక్కుగూడ విజయభేరి సభలో సోనియా గాంధీ ఆరు గ్యారంటీలను ప్రకటించిదని రానున్న ఎన్నికల్లో రాష్ట్రమిచ్చిన కాంగ్రెస్ పార్టీని అదరించాలని కవ్వంపల్లి విజ్ఞప్తి చేశారు. రెండో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్,మండలాధ్యక్షుడు రత్నాకర్‌రెడ్డి, నియోజవర్గ యువజన ఉపాధ్యక్షుడు శానగొండ శ్రావణ్, మండల,గ్రామ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.