LSG vs DC: కుల్దీప్ స్పిన్ మాయ.. ఏడు వికెట్లు కోల్పోయిన ల‌క్నో

నవతెలంగాణ- హైదరాబాద్: ఐపీఎల్ ప‌దిహేడో సీజ‌న్‌లో కుల్దీప్ యాద‌వ్ త‌న స్పిన్ మాయ చూపించాడు.వ‌స్తూ వ‌స్తూనే డేజంర‌స్ కేఎల్ రాహుల్(39), మార్క‌స్ స్టోయినిస్(8), నికోల‌స్ పూర‌న్‌(0)ల‌ను పెవిలియ‌న్ పంపాడు. దాంతో, ల‌క్నో జ‌ట్టు 77 ప‌రుగుల‌కే ఐదు వికెట్లు కోల్పోయింది. ఆ త‌ర్వాత ఇషాంత్ శ‌ర్మ ఓవ‌ర్లో దీపక్ హుడా(10) వెనుదిరిగాడు. అక్క‌డితో 12 ప‌రుగుల వ్య‌వ‌ధిలో రాహుల్ సేన ఆరో వికెట్ కోల్పోయింది. ప్ర‌స్తుతం ఆయువ‌ష్ బ‌దొని(19), అర్షద్ (7)లు ఆడుతున్నారు. 15 ఓవ‌ర్ల‌కు స్కోర్.. 114 /7.  ప‌దిహేడో సీజ‌న్‌లో వ‌రుస‌గా మూడు విజ‌యాల‌తో జోరుమీదున్న‌ ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌కు ఆదిలోనే షాక్ త‌గిలింది. డేంజ‌ర‌స్ ఓపెన‌ర్ , క్వింట‌న్ డికాక్(19) ఔట‌య్యాడు. ఖ‌లీల్ అహ్మ‌ద్ వేసిన తొలి ఓవ‌ర్లో రెండు ఫోర్లు బాదిన డికాక్.. అత‌డి ఓవ‌ర్లోనే ఎల్బీగా వెనుదిరిగాడు.

Spread the love