నవతెలంగాణ-తాండూరు
తాండూరు పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్ పూర్వ విద్యార్థులు సాత్విక్ రాజ్, అక్షరు రెడ్డి, అక్షరు ఎంబిబి ఎస్, ఐఐటి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచి సీట్లు సాధించారని ప్రిన్సిపాల్ షేక్ మదార్ తెలిపారు. పాఠశాలలో సిబ్బందితో కలిసి విద్యార్థుల ను పూలమాల శాలువాతో బుధవారం సన్మానించా రు. సాత్విక్ రాజ్ నీట్ పరీక్షల్లో 98.2 పర్సంటైల్‌తో 591 మార్కులు సాధించగా అక్షరు రెడ్డి 96 పర్సం టైతో 510 మార్కులు సాధించాడు అన్నారు. అదేవి ధంగా అక్షరు జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో 94.5 పర్సంటై సాధించి అడ్వాన్స్ పరీక్షల్లో 5037 ర్యాం కును సాధించి ఐఐటీలో సీటును కైవసం చేసుకో వడం జరిగిందన్నారు. ఎంబీబీఎస్ ఐఐటీల్లో సీట్లు సాధించిన విద్యార్థులను వారి తల్లిదండ్రులను శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీ విద్య, డీజీఎం సుధాకర్, ఆర్‌ఐరఘు, కోఆర్డినేటర్ వీరస్వామిలు ప్రత్యేకంగా అభినందించారు. తాండూ రు ఎక్సైజ్ ఎస్సై చిన్న రాములు ప్రత్యేక అతిథిగా హాజరై విద్యార్థులను, తల్లిదండ్రులను సన్మానించారు. కార్యక్ర మంలో విద్యార్థుల తల్లిదండ్రులు రాజశేఖర్, మంజుల, విష్ణువర్ధన్ రెడ్డి, అనురాధ రెడ్డి, వేణు గోపాల్, పావని, డీన్ శివరాం, ఏవో రవీందర్ రెడ్డి, ప్రైమరీ ఇన్‌చార్జి అనిత, ఉపాధ్యాయులు సంజీవ కుమార్ తదితరులు పాల్గొన్నారు.