రేపటి నుంచి మధ్యాహ్న భోజన

– కార్మికుల నిరవధిక సమ్మె
– మధ్యాహ్నం భోజన జిల్లా కార్యదర్శి యెలమొని స్వప్న
– ఇబ్రహీంపట్నం మండల ఎంఈఓకు సమ్మె నోటీసు అందజేత
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 28 నుంచి నిరవదిక సమ్మె చేయబోతున్నారని మధ్యాహ్నం భోజన జిల్లా కార్యదర్శి యెలమొని స్వప్న తెలిపారు. తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌ సీఐటీయూ పిలుపులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 28 నుంచి కొనసాగనున్న నిరవధిక సమ్మెకు సంబంధించిన సమ్మె నోటీసును మంగళవారం ఇబ్రహీంపట్నం మండల విద్యాధికారి వెంకట్‌రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2022 మార్చి 15న ముఖ్యమంత్రి అసెంబ్లీలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులను వేతనం 2 వేలు పెంచినట్టు ప్రకటించిన ఇప్పటివరకు అమలు చేయలేదని అన్నారు. సుదీర్ఘ పోరాటాల ఫలితంగా జీవో ఎంఎస్‌ నెంబర్‌ 8ని విడుదల చేసిందని, అదేవిధంగా పెండింగ్‌ బిల్లులు కూడా విడుదల చేయడం లేదని కార్మికులు కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దీంతో కార్మికులు అప్పుల పాలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారానికి మూడు కోడిగుడ్లు పెట్టాలని ప్రభుత్వాన్ని నిర్ణయించిన అదనంగా బడ్జెట్‌ కేటాయించకుండా మెనూ చార్జీలో పెంచకుండా వారిని ఒత్తిడికి గురి చేసిందని ఈ సందర్భంగా తెలిపారు. పారిశ్రామిక వివాదాల చట్టం 1947 సెక్షన్‌ 22 సబ్‌ సెక్షన్‌ (1) అనుసరించి సెప్టెంబర్‌ 28వ తేదీ నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నారని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. వినతి పత్రం అందజేసిన వారిలో సీఐటీయూ ఇబ్రహీంపట్నం మున్సిపల్‌ కన్వీనర్‌ చింతపట్ల ఎల్లేశ, సీఐటీయూ మంచాల మండల కన్వీనర్‌ పోచమోని కృష్ణ, మధ్యాహ్న భోజన కార్మికులు శిరీష, చింతకింద సరిత, అలివేలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love