నవతెలంగాణ అమరావతి: స్కిల్‌డెవలప్‌మెంట్ వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టుపై ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. చంద్రబాబును అరెస్టు చేసిన తీరు అక్రమమని మాజీ అడ్వకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ‘‘గవర్నర్ అనుమతి తీసుకోకుండా ఎలా అరెస్టు చేస్తారు? అవినీతి నిరోధక చట్టం సెక్షన్17 ఏ ప్రకారం అనుమతి లేకుండా ఎలా అరెస్టు చేస్తారు? ఈ ప్రక్రియ అంతా సరికాదు. సీఐడీ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. దీనిపై వాదనలు వినిపిస్తాం’’ అని పిటిషన్లో దమ్మాలపాటి పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించి విచారణ బుధవారం చేపడతామని హైకోర్టు న్యాయమూర్తి తెలిపారు.