లూసిఫర్‌ 2తో లైకా ప్రొడక్షన్స్‌ మాలీవుడ్‌ ఎంట్రీ

With Lucifer 2 Laika Productions' Mollywood entryమోహన్‌లాల్‌, పథ్వీరాజ్‌ సుకుమారన్‌ కాంబినేషన్‌లో రూపొందిన ‘లూసిఫర్‌’ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదే చిత్రాన్ని తెలుగులో ‘గాడ్‌ఫాదర్‌’గా రీమేక్‌ చేసి చిరంజవి సైతం ఘనం విజయం సాధించారు. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ‘ఎల్‌2ఇ: ఎంపురాన్‌’ చిత్రం ఇదే కాంబోలో తెరకెక్కనుంది. అయితే ఈ సినిమా ఆంటోని పెరంబవూర్‌ చైర్మన్‌గా కొనసాగుతున్న ఆశీర్వాద్‌ సినిమాస్‌ బ్యానర్‌తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ కలయికలో జి.కె.ఎం.తమిళ్‌ కుమరన్‌ నేతత్వంలో రూపొందనుండటం విశేషం.
‘సంస్కతి, సాంప్రదాయలకు విలువనిచ్చే మాలీవుడ్‌లోకి లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ అధినేత సుభాస్కరన్‌ అడుగుపెట్టడం ఆనందంగా ఉంది. అలాగే లైకా ప్రొడక్షన్స్‌ మలయాళంలో సినిమాలు తీయటానికి సిద్ధమవటం అనేది చిత్ర పరిశ్రమ అభివద్ధికి ఎంతో దోహదం చేయటమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులకు ఎన్నో కొత్త కథాంశాలతో సినిమాలను చూసే అవకాశాలను కలిగించొచ్చు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ కోసం మాతో చేతులు కలపడం ఆనందంగా ఉంది’ అని ఆశీర్వాద్‌ సినిమాస్‌ సంస్థ పేర్కొంది.
మంచు విష్ణు ‘కన్నప్ప’లో మోహన్‌ లాల్‌
హీరో మంచు విష్ణు పాన్‌ ఇండియా సినిమాగా నిర్మిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. అవా ఎంటర్‌టైన్‌మెంట్‌, 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై ‘మహాభారత్‌’ సిరీస్‌ ఫేమ్‌ ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాలో ప్రభాస్‌ ఓ ముఖ్య పాత్రను పోషించబోతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో స్టార్‌ మోహన్‌ లాల్‌ సైతం ఇందులో ఓ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం ‘కన్నప్ప’ టీం న్యూజిలాండ్‌లో ఉంది. పరుచూరి గోపాలకష్ణ గారు, విజయేంద్ర ప్రసాద్‌, తోటపల్లి సాయి నాథ్‌, తోట ప్రసాద్‌, నాగేశ్వర రెడ్డి, ఈశ్వర్‌ రెడ్డి.. తదితరులు ఈ స్క్రిప్ట్‌ను అద్భుతంగా మలిచారని మంచు విష్ణు చెప్పారు.

Spread the love