“మాచన” మాటే మంత్రం

– పొగాకు, ధూమపానం పై రణం
వెల్ డన్..రఘునందన్! అంటూ అమెరికా నుంచి వచ్చిన అభినందనలు అతన్ని ఆశ్యర్యానికి గురి చేయలేదు. తాను చేస్తోన్న సామాజిక సేవకు రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం కొత్తేమి కాదు…కానీ ఏకంగా అమెరికా నుంచి అభినందనలు రావడం గర్వంగా ఉందంటారు రఘునందన్ మాచన. రాష్ట్ర పౌరసరఫరాలశాఖ లో ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసీల్దార్. ఉద్యోగం. విధి నిర్వాహణలో అంకిత భావం కలిగినవాడు. తన దగ్గరకు వచ్చే బాధితులను ఆత్మీయతతో ఆదరించే అరుదైన అధికారి. ఒక అధికారిగా ప్రజలకు సేవ చేయాలనే బాధ్యత నెరిగిన వాడే కాదు…అంతకు రెట్టింపు సామాజిక స్పృహ కలిగిన వాడు రఘునందన్ మాచన. అందరూ బాగుండాలి.. ఆరోగ్యంగా ఉండాలనే ఆరాటమే అతనికి అంతర్జాతీయ గుర్తింపును తీసుకొచ్చింది. ఇంతకీ రఘునందన్ చేస్తోన్న పనేంటి అంటారా? తనకు ఇంటర్ చదివే రోజుల్లో దీక్షితులు అనే స్నేహితుడి స్నేహం లో ఉన్న మాధుర్యం తో మైత్రి గొప్ప దనం గుర్తెరిగారు. స్నేహమే రా జీవితం ఆన్న చందాన సాగిన వీరి ప్రాణ స్నేహితుల దోస్తానా..కు కొన్నాళ్ళ తరువాత పొగాకు ధూమపానం ప్రభావం వల్ల ప్రాణ స్నేహితుణ్ణి కోల్పోవాల్సి వచ్చింది. ఏ..రా రఘు..ఎలాగూ నేను వెళ్ళిపోతున్నాను. నాకు మాదిరి గా ఇంకెవ్వరికీ పొగాకు, ధూమపానం తో ఇలా జరగకూడదు. అలా చేయగలవా..రా అని ఆన తీసుకున్నారు. తన ప్రాణం కన్నా ప్రాణ ప్రదం గా చూసుకున్న మనిషి పొగాకు కు బలవ్వడం కళ్ళారా చూసి కలత చెందారు రఘునందన్.
లక్షల మంది సైతం తెలిసీ తెలియకుండానే సరదాగా చేసుకున్న అలవాటుతో..పొగాకు, ధూమపానం బారిన పడి చనిపోతున్న సాదృష్యంతో ఓ మనసున్న మనిషిగా .. స్పందించాడు. చాలా మంది దమ్ము కొట్టే వాళ్ళు తమ మానాన తాము ఆలా గాల్లోకి పొగ వదుల్తూ.. ఆనందాన్ని ఆస్వాదిస్తారే తప్ప ఆ పొగ కు ఇతరులు కూడా ఇబ్బంది పాడతారు ఆన్న విషయం పట్టించు కొరు. అందుకే తన శాయా శక్తులా చేతనైనంత మేరకు ప్రయత్నించి జన్నాని పొగాకు అలవాటు నుంచి మళ్ళించే మనిషి గా మారాడు. కొంతమందిని ఐనా పొగాకు బారి నుంచి తప్పించాలని నిర్విరామ కృషి కి పూనుకున్నాడు. పొగత్రాగడం వల్ల కలిగే అనర్ధాలపై ప్రజలకు అవగాహన కల్పించి పొగత్రాగడాన్ని మాన్పించాలని ప్రవృత్తిగా పెట్టుకున్నాడు. రోడ్డు, బస్టాండ్, రైల్వే స్టేషన్, హోటల్, ఇలా ప్రదేశం ఏదైనా పొగ తాగుతూ కనిపించే వారి దగ్గరి కెళ్లి సార్..! సిగరెట్ కాల్చకండి ప్లీజ్!! అంటూ అభ్యర్ధిస్తాడు. తాతా బీడీ తాగొద్దు.! మీ కొడుకో, మనవడో బీడీ తాగితే సంతోషమేనా? క్యాన్సర్ లాంటి జబ్బులొస్తే ఎట్లా? అంటూ వారిని ప్రశ్నిస్తాడు. పొగత్రాగడం వల్ల కలిగే దుష్పరిణామాలను వివరిస్తాడు. పొగత్రాగడం మానేయమని హితబోధ చేస్తాడు. “పొగాకు మానేస్తే బే ఫికర్…నో క్యాన్సర్” అంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తాడు. ఇరవై ఏళ్ళు గా పొగాకు, ధూమపాన నియంత్రణ కోసం కృషి చేస్తోన్న సేవా పిపాసి.
పొగ త్రాగడాన్ని, పొగాకు తినడాన్ని మాన్పించేందకు రఘునందన్ మాచన చేస్తోన్న కృషి జాతీయ స్థాయిలో పొగాకు నియంత్రణ కోసం పని చేస్తోన్న రిసోర్స్ సెంటర్ ఫర్ టుబాకో కంట్రోల్ వారి దృష్టిలో పడింది. వారు వెంటనే ఉపకార వేతనంతో కూడిన మూడు నెలల మొదటి బ్యాచ్ శిక్షణ కార్యక్రమానికి ఆహ్వానించారు.  మరో రెండు రోజుల్లో 2021 వ సంవత్సరంలోకి అడుగుపెడతామనగా…అందరూ “గుడ్ బై ఓల్డ్ ఇయర్” అని సోషల్ మీడియాలో తెగ మెసేజ్ లో పెడతున్నారు. కానీ రఘునందన్ మాచన మాత్రం అందరిలా కాకుండా,తన లక్ష్యాని కనుగుణంగా సరికొత్తగా “గుడ్ బై ఓల్డ్ ఇయర్ అండ్ టుబాకో” అని మెసేజ్ చేశాడు. ఈ ఒక్క సందేశం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ఆలోచింపజేసింది. హైదరాబాద్‌ కు చెందిన రఘునందన్ మాచనను ఖండాంతరాలకు పరిచయం చేసింది. అమెరికా గుర్తించేలా చేసింది. “సే నో టు టుబాకో”అని సామాజిక మాధ్యమాల్లో టైప్ చేస్తే చాలు క్షణాల్లో కనబడే పేరు రఘునందన్ మాచన. “సే నో టు టుబాకో” “క్విట్ టుబాకో ” “పొగాకు రహిత తరం” “టుబాకో ఫ్రీ ఇండియా” అనేవి రఘునందన్ నినాదాలు. రఘునందన్ మాటలు విని లక్షలాది మంది పొగత్రాడగాన్ని, పొగాకు,గుట్కాలు నమలడాన్ని మానేశారు. వారంతా ఆరోగ్యంగా ఉంటూ తనను కలుస్తుంటే తాను చేసిన మంచి పని ఎంతో ఆనందిస్తానంటారు రఘునందన్.
తెలంగాణ రాష్ట్రం మేడ్చల్ జిల్లా కేశవరం గ్రామానికి చెందిన రఘునందన్ కు చిన్నతనం నుంచే సామాజిక స్పృహ కలిగిన వాడు. తన తండ్రి అభిమన్యు మాచన ఇంగ్లీష్‌ టీచర్. ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ట్రపతి పురస్కారాన్ని అందుకున్నారు. పూర్వ రంగారెడ్డి జిల్లాలో అభిమన్యు సార్ చేసిన మానవీయ సేవలను ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. మన కోసం మనం బ్రతకడమే కాదు…మన వంతుగా ఈ సమాజానికి ఏదో ఒక సేవ చేయాలనే స్ఫూర్తి తన తండ్రి నుంచే వచ్చిందంటారు రఘునందన్. మనం చేసే ప్రతి మంచి పనిని ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారనే తన తండ్రి మాటలను ఆచరణలో పెడుతున్నారు ఈ అధికారి. టీపోపా విద్యాజ్యోతి పేరుతో ప్రతిభ కలిగిన పేద విద్యార్ధులను ఉన్నత చదువులు చదివేందుకు ప్రోత్సహిస్తున్నారు. వెల్ డన్..రఘునందన్ అంటూ ఈ సమాజం చేత అభినందనలు అందుకుంటున్నారు.

Spread the love