– తొలగించిన సిబ్బందికి 9 నెలలు అవకాశం
లండన్ : గ్లోబల్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ మెకెన్సీ తమ ఉద్యోగుల తొలగింపుల పట్ల అత్యంత ఉదారతను ప్రదర్శించింది. బ్రిటన్‌లో 3000 మంది ఉద్యోగులను తొలగించడానికి గత ఫిబ్రవరి నోటీసులు ఇచ్చింది. అలా ఉద్వాసనకు గురైన వారికి తొమ్మిది నెలల వేతన పరిహార ప్యాకేజీ, తదుపరి ఉద్యోగాలకు కెరీర్ శిక్షణ అందిస్తామని తెలిపింది. ఇతర కంపెనీల్లో వారు ఉద్యోగం పొందేందుకు తొమ్మిది నెలల గడువు ప్రకటించింది. ఈ సమయంలో కెరీర్ కోచింగ్ కోర్సులు, ఇతర వనరులు ఉచితంగా వాడుకోవచ్చునని పేర్కొంది. ఆ తర్వాత కూడా ఉద్యోగం పొందలేకపోతే తమ సంస్థను వీడాల్సిందేనని స్పష్టం చేసింది.