నవతెలంగాణ – ఆర్మూర్
మండలం లోని చేపూర్ గ్రామంలో పిచ్చికుక్కలు ఆదివారం స్వైర విహారం చేసి 7 మందికి తీవ్ర గాయాలు చేశాయి. కుటుంబ సభ్యులు గ్రామస్తుల సహాయంతో ఆర్మూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొని రాగా.. ప్రతిమ చికిత్స చేసి తీవ్ర గాయాలైన నలుగురికి వేల్పుల నరసయ్య (50) కల (30)పోసాని(60) లత (40) రాజ గంగారం60) బట్టు లాస్య(45) మెరుగైన వైద్యం కోసం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించడం జరిగింది. గ్రామంలో పిచ్చికుక్కల బెడద ఎక్కువగా ఉన్నా.. పంచాయతీ కార్యదర్శి కానీ, వీడీసీ సభ్యులు గాని ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే కుక్కలు దాడి చేశాయని బాధితుల బంధువులు ఆరోపించారు. ఇకనైనా గ్రామంలో సామాన్య ప్రజలకు కుక్కల బెడద నుండి రక్షించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు.