8 మందిని కరచిన పిచ్చికుక్క…

నవతెలంగాణ-గోవిందరావుపేట
మండలంలోని చల్వాయి గ్రామంలో బుధవారం ఉదయం 8 మందిని పిచ్చికుక్క కరచినట్లు ప్రాథమిక వైద్యాధికారి డాక్టర్ సుకుమార్ తెలిపారు. చల్వాయి గ్రామం నుండి ఎనిమిది మంది పిచ్చి కుక్క కరిసిందని బుధవారం ఉదయం 8 గంటల సమయంలో ఆసుపత్రికి రావడం జరిగిందన్నారు. ఐదుగురు మహిళలు కాగా ముగ్గురు పురుషులు ఉన్నారు. పిచ్చికుక్క బాధితులకు వెంటనే ప్రాథమిక చికిత్స అందించి హిమ్మొనోగ్లోబిన్ వ్యాక్సిన్ కొరకు ములుగు పెద్ద ఆసుపత్రికి పంపించినట్లు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో కుక్కలలో ఈ వ్యాధి లక్షణాలు వస్తుంటాయని సొల్లు కార్చుతూ తోక ముడుచుకుని నిరంతరం రాబిడ్ సోకిన పై లక్షణాలున్న కుక్కలు నిరంతరం పరిగెడుతూనే ఉంటాయని అన్నారు. ప్రజలు పిచ్చికుక్కల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు.

Spread the love